వైరల్ అవుతున్న అగ్రకథానాయిక చిన్ననాటి పిక్..?

Purushottham Vinay
ఈ ఫోటోలో ఉన్న ముద్దుల బుజ్జాయి ఎవరో గుర్తుపట్టండి. ఆమె దక్షిణాదిలోనే అగ్రకథానాయిక నయనతార.తన అందం, అభినయంతో ఇండస్ట్రీలో మంచి సక్సెస్‏ఫుల్ హీరోయిన్ గా రాణిస్తూ దూసుకుపోతుంది.ఈ ముద్దుగుమ్మకు ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. అగ్రహీరోలకు సమానంగా ఆమె రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అంతేకాదండోయ్.. హీరోల కంటే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ వస్తుందంటే థియేటర్లు బ్లాక్ అవ్వాల్సిందే. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి ఎంతగానో మెప్పించింది. నయనతార పెళ్లి తర్వాత కూడా వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. . అమాయకత్వమే కాదు.. గ్లామర్ షోకు.. పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు అయిన నయనతార పెట్టింది పేరు. ఆమె ఎన్ని హిట్ చిత్రాల్లో నటించినా.. మీడియా ముందుకు వచ్చేందుకు మాత్రం అస్సలు ఇష్టపడదు. ప్రమోషన్లలో అయితే అస్సలు పాల్గొనదు. ఇంటర్యూలకు.. షోలకు.. అటెండ్ కాదు నయనతారా. ఇక ఈ రోజు ఆమె పుట్టినరోజు.తమిళనాడులో లేడీ సూపర్ స్టార్ నయనతార. 

చంద్రముఖి లో అమాయకపు దుర్గల కనిపించి తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది. కేరళలోని తిరువల్లాకు చెందిన నయన్.. ఆమె ఆంగ్ల సాహిత్యంలో బీఏ పూర్తిచేసింది. మనసిక్కరే సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన నయన్.. లక్ష్మీ తో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది.బాస్, దుబాయ్ శీను, తులసి, అదుర్స్, బాడీగార్డ్, సింహా, శ్రీరామరాజ్యం, సైరా సినిమాల్లో నటించి మెప్పించింది.ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కూడా కీలకపాత్రలో నటించింది.తమిళ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ఆరేళ్లు ప్రేమలో ఉన్న నయన్.. ఈ సంవత్సరం జూన్ 9న కుటుంబసభ్యుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అక్టోబర్ 9న సరోగసి పద్ధతి ద్వారా కవలలకు తల్లిదండ్రులు అయ్యారు. ప్రస్తుతం నయన్.. షారుఖ్.. డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న జవాన్ సినిమాలో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: