వీర సింహారెడ్డి లో రాజకీయ దుమారం !

Seetha Sailaja
బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరొకవైపు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికలలో అధికారంలోకి తీసుకు రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అతడి శక్తిమేరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే 2024 ఎన్నికల ముందు బోయపాటి దర్శకత్వంలో ఒక మూవీని చేసి ఆమూవీలో పొలిటికల్ సెటైర్లు నింపాలని ఇప్పటికే బాలయ్య ఇచ్చిన సూచనతో బోయపాటి ఒక పవర్ ఫుల్ రాజకీయ స్క్రిప్ట్ తయారుచేయడం మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇంకా ఆసినిమా ప్రారంభం కాకుండానే మరో మూడు నెలలలో రాబోతున్న సంక్రాంతి మూవీ ‘వీర సింహారెడ్డి’ లో కొన్ని పొలిటికల్ పంచ్ డైలాగ్స్ బాలకృష్ణ తో దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ డైలాగ్స్ ఆంధ్రప్రదేశ్ లోని వర్థమాన రాజకీయాలను టార్గెట్ చేసేవిగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ సంభాషణల రచయిత బుర్రా సాయి మాధవ్ రచించిన కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరోక్షంగా టార్గెట్ చేసేవిగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

ఈవార్తలే నిజం అయితే ‘వీర సింహారెడ్డి’ ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ దుమారం రేపడం ఖాయం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి పొలిటికల్ డైలాగ్స్ ఎంతవరకు సెన్సార్ ను దాటుకుని ‘వీర సింహారెడ్డి’ లో వినిపిస్తాయి అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాలకృష్ణ పంచ్ డైలాగ్స్ లో రాజకీయం కనిపిస్తే ఇక అది మీడియాకు సంచలనంగా మారి దానిపై అనేక చర్చలు వివాదాలు చుట్టుముడుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈమూవీ సంక్రాంతి రేస్ లో విడుదల అవుతున్నప్పటికీ ‘వాల్టేర్ వీరయ్య’ తో ఈమూవీ పోటీగా విడుదల అవుతున్న పరిస్థితులలో ‘వీర సింహారెడ్డి’ కి సరైన ధియేటర్లు దొరకడం కష్టంగా మారింది అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి. అదే నిజం అయితే బాలయ్య అభిమానుల ఆగ్రహంలో ‘వాల్టేర్ వీరయ్య’ టార్గెట్ అవుతుంది అన్న సందేహాలు కొందరికి వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: