కృష్ణను బాధ పెట్టడం కరెక్ట్ కాదనే వైద్యం ఆపేశారట...!?

Anilkumar
కృష్ణకు వైద్యం అందించిన డాక్టర్స్ లాస్ట్ స్టేట్మెంట్ విస్తుపోయేలా ఉంది. అయితే ఒక దశ వరకు వైద్యం అందించిన డాక్టర్స్… తర్వాత ఆపేశారని ఆయన మాటల వలన తెలుస్తుంది.ఇక డాక్టర్స్ వివరణ మేరకు… కార్డియాక్ అరెస్ట్ తో కృష్ణ ఆసుపత్రిలో చేరారు. కాగా విషమ స్థితిలోనే ఇక్కడకు రావడం జరిగింది.ఇక  మేము వెంటనే ఐసీయూ లో పెట్టి వెంటిలేటర్ సప్పోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక  సమయం గడిచే కొద్దీ ఒక్కొక్క ఆర్గాన్ ఫెయిల్ అవుతూ వచ్చాయి. గంట గంటకు కుటుంబ సభ్యులతో కృష్ణ ఆరోగ్యం గురించి మాట్లాడాము.

అయితే చివరికి ఒక అగ్రిమెంట్ కి రావడం జరిగింది. ఇక ఎలాంటి చికిత్స అందించినా ప్రయోజనం ఉండదు. కాగా ఆయన కాపాడుకోవడం కష్టం. వైద్యం ద్వారా ఆయన్ని ఇబ్బంది పెట్టడం తప్పితే కాపాడే మార్గం లేదనుకోవడం జరిగింది. ఇక దీంతో సప్పోర్ట్ తగ్గించుకుంటూ వచ్చామని చెప్పడం జరిగింది. అయితే డాక్టర్స్ మాటలు పరిశీలిస్తే ఆయనకు వైద్యం ఆపేశారని స్పష్టంగా తెలుస్తుంది.ఇకపోతే  కొన్ని గంటలు ఆయన ప్రాణాలు నిలబెట్టగలం కానీ బ్రతికించుకోలేమని గ్రహించిన వైద్యులు కుటుంబ సభ్యుల అనుమతితో వైద్యం ఆపేశారని అనుకోవచ్చు.

అయితే ఇంట్లో కృష్ణ అచేతనంగా ఎక్కువ సమయం ఉన్నట్లు డాక్టర్ వెల్లడించారు. ఇక ఈ కారణంగా ప్రధాన అవయవాలు డ్యామేజ్ అయ్యాయి. కాగా బ్రెయిన్ కి కనీసం 5 నిమిషాలు ఆక్సిజన్ అందకపోతే పాడయ్యే ఛాన్స్ ఉంటుందన్నారు. అయితే అర్ధరాత్రి సమయం కావడంతో కృష్ణ ఇబ్బందిని ఎవరూ గుర్తించి ఉండరు. ఒకవేళ సరైన సమయంలో చూసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.అయితే కృష్ణకు ఉన్న ఆరోగ్య సమస్యలు గురించి డాక్టర్ చెప్పడానికి నిరాకరించారు. ఇక కృష్ణ చాలా ధైర్యం ఉన్న వ్యక్తి. డాక్టర్స్ చెప్పిన విషయాలు తూచా తప్పకుండా పాటించేవారు.ఇకపోతే  మందులు క్రమపద్దతిగా వాడేవారు. డాక్టర్స్ పట్ల ఆయనకు చాలా గౌరవం ఉండేది.కాగా  ఆయన ఒక ఫైటర్ అంటూ డాక్టర్స్ వెల్లడించారు. ప్రస్తుతం కృష్ణ వయసు 79 సంవత్సరాలు. ఇక చాలా కాలంగా కృష్ణ వృద్ధాప్య సమస్యలతో భాదపడుతున్నారు. కాగా మహేష్ కుటుంబంలో వరుసగా ఇది మూడో మరణం.అయితే  ఇదే ఏడాది రమేష్ బాబు, ఇందిరా దేవి మరణించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: