బిగ్ బాస్ విన్నర్ అతనే అని అంటున్న వాసంతి.. అలా జరగడం సాధ్యమేనా?

Anilkumar
తాజాగా బిగ్ బాస్ షో సీజన్6 నుంచి  వాసంతి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మెరీనా ఎలిమినేట్ అవుతుందని మొదట ప్రచారం జరిగినా వాసంతిని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు.ఇకపోతే వాసంతికి సోషల్ మీడియాలో కూడా భారీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం తెలిసిందే.అయితే  క్రేజ్ ఉన్న కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తున్నారని ఏ మాత్రం క్రేజ్ లేని కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నారని కొంతమంది నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వాసంతి

 తన అభిప్రాయం ప్రకారం రేవంత్ బిగ్ బాస్ షో విన్నర్ గా నిలిచే అవకాశం ఉందని చెబుతుండటం గమనార్హం.ఇక  గేమ్ లో అగ్రెసివ్ గా ఉండటంతో పాటు చాలా కష్టపడతాడని ఈ రీజన్ వల్లే రేవంత్ బిగ్ బాస్ సీజన్6 విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాసంతి నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే ఇతర కంటెస్టెంట్లతో పోల్చి చూస్తే గేమ్ బెటర్ గా ఆడటంతో పాటు ఇతరులతో బాగా ఉంటాడని ఈ రీజన్ వల్లే రేవంత్ బిగ్ బాస్ షోకు విజేతగా నిలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని వాసంతి చెప్పుకొచ్చారు.

ఇదిలావుంటే మరోవైపు కొంతమంది కంటెస్టెంట్లకు బిగ్ బాస్ షో నిర్వాహకుల సపోర్ట్ ఉందని ఆ రీజన్ వల్లే ఈ కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక చలాకీ చంటి, బాలాదిత్య స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయినప్పటికీ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. కాగా వాసంతి అంచనాల ప్రకారం రేవంత్ బిగ్ బాస్ విజేతగా నిలిచి ఆశ్చర్యపరుస్తారేమో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: