ట్రైలర్: అల్లరి నరేష్ ఈసారి కూడా సక్సెస్ అవుతారా..!!

Divya
అల్లరి నరేష్ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈ చిత్రాన్ని ఏ ఆర్ మొహం దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఆనంది హీరోయిన్గా నటిస్తూ ఉన్నది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఇంకో నాలుగు రోజుల్లో మీ ఊర్లో ఎలక్షన్ జరగబోతున్నాయి అంటూ అల్లరి నరేష్ చెప్పే డైలాగులతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది.

ఒక మారుమూల ప్రాంతం అయిన మారేడుమిల్లి గ్రామానికి వెళ్లే ప్రభుత్వ అధికారి పాత్రలో అల్లరి నరేష్ కనిపించబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఎన్నికలు సజావుగా సాగేలా చూస్తూ ఉంటారు అల్లరి నరేష్. ఆ తర్వాత ఎలక్షన్లలు జరుగుతున్న సమయంలో అక్కడి ప్రజలు పడుతున్న కష్టాలను అర్థం చేసుకొని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అల్లరి నరేష్. అలా మారేడుమిల్లి ప్రజానీకం హక్కుల కోసం పోరాడేందుకు వచ్చిన అల్లరి నరేష్ రాజకీయ నేతలు, పోలీసులు అతనిపై ఆగ్రహం అవుతున్నట్లుగా ఈ ట్రైలర్లు చూపించడం జరుగుతోంది.

ఇక అల్లరి నరేష్ గత చిత్రం నాంది మాదిరే ఈ చిత్రం కూడా సీరియస్ సబ్జెక్టుతో వ్యవహరించే చిత్రంలో కనిపిస్తోంది. ఇక జనం బతుకు కోసం ఎంతో కష్టపడుతున్న వారిని చూసి సహాయం చేయాలని అల్లరి నరేష్ ఎదుర్కొన్న కష్టాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఐఎంపీ ట్రైలర్ అల్లరి నరేష్ అభిమానులను సైతం బాగానే ఆకట్టుకున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా సీరియస్గా సాగేటువంటి ఈ కథను జి స్టూడియో సమర్పణలు తెరకెక్కించడం జరుగుతుంది. ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేసినట్లుగా తెలుస్తోంది ఈ చిత్రం నవంబర్ 25న థియేటర్లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఈ ట్రైలర్తో తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: