వావ్: బింబిసార చిత్రం పాన్ ఇండియా లెవెల్లో..!!

Divya
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా డైరెక్టర్ మల్లిడి వశిష్టి దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ యాక్షన్ చిత్రం బింబిసార. ఈ చిత్రం ఆగస్టులో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటి లో కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ zee -5 లో స్ట్రీమింగ్ కాబడింది. అయితే బింబిసార చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అందించబోతున్నారు. ఇప్పటివరకు కేవలం తెలుగులో మాత్రమే ఈ చిత్రం అందుబాటులో ఉండగా తాజాగా ఈ చిత్రాన్ని హిందీ తో పాటు తమిళ్ కన్నడ మలయాళం వంటి భాషలలో కూడా డబ్బింగ్ చేసి ఓటీటి లో స్ట్రిమింగ్ చేస్తున్నారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన మేకర్.. మీ ప్రేమకు అందరికీ ధన్యవాదాలు మేము హిందీలో బింబిసార చిత్రంతో మీ దగ్గరికి వస్తున్నామని తెలియజేశారు. అన్ని ప్రధాన భారతీయ భాషలలో కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సినిమా జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంటుందని కళ్యాణ్ రామ్ అభిమానులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందం వెల్లడించారు. వాస్తవానికి దక్షిణాది చిత్రాలు నార్త్ లో బాగా ఆకట్టుకుంటున్నాయి.

బింబిసార సినిమాని కూడా హిందీలోకి డబ్  చేసి థియేటర్లు విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే ఎందుకో ఇప్పుడు కేవలం ఓటీటి ద్వారానే విడుదల చేస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తెరకెక్కించిన ఈ చిత్రం బింబిసారుడి కథ అంశంగా పెరకట్టించడం జరిగింది. ఈ చిత్రానికి VFX గ్రాఫిక్స్ తో పాటు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. ఇందులో హీరోయిన్ గా కేథరిన్, సంయుక్త మీనన్ నటించారు. ప్రకాష్ రాజ్, రాజీవ్ కనకాల, సాయికిరణ్, వెన్నెల కిషోర్ ,శ్రీనివాస్ రెడ్డి ,వైవాహర్ష తదితరులు కీలకమైన పాత్రలో నటించారు. మరీ చిత్రం ఓటీటి లో విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: