వాల్తేరు వీరయ్య : రవితేజ టీజర్ అప్డేట్ రాబోతోందా..?

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే అనేక మూవీ లలో నటించి ఎంతో మంది సినీ ప్రేమికుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం ఖిలాడి ,  రామారావు ఆన్ డ్యూటీ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఖిలాడి మూవీ కి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా ,  రామారావు ఆన్ డ్యూటీ మూవీ కి శరత్ మండువా దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే రవితేజ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య అనే మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.  వాల్తేరు వీరయ్య మూవీ లో రవితేజ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ లో చిరంజీవి , రవితేజ మధ్య కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరియు ఒక పాట కూడా ఉండబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళ్తే ... ఈ మూవీ లో రవితేజ ఇంట్రడక్షన్ టీజర్ ను విడుదల చేయడానికి మూవీ యూనిట్ ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ లోని రవితేజ ఇంట్రడక్షన్ టీజర్ ను మూవీ యూనిట్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే వాల్తేరు వీరయ్య మూవీ లో శృతి హాసన్ , చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: