కాంతార దెబ్బకు పుష్ప కూడా ఔట్?

Purushottham Vinay
పెద్దగా ప్రమోషన్లు ఏమి లేకుండా సైలెంట్ గా విడుదలై రికార్డులు సృష్టించడం మొదలు పెట్టింది `కాంతార` సినిమా. కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడిగా రూపొందించిన ఈ మూవీ కన్నడ తెలుగు తమిళ హిందీ భాషల్లో డ్రీమ్ రన్ ని కొనసాగిస్తూ ఊహించని వసూళ్ళని అధిగమిస్తూ పలు పాన్ ఇండియా సినిమాల రికార్డుల్ని కూడా ఈజీగా తుడిచి పెట్టేస్తోంది. హోంబలే ఫిలింస్ తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా తెలుగులో దాదాపు రూ. 60 కోట్ల వరకు వసూళ్లని రాబట్టింది. ఇక హిందీలో కూడా కేజీఎఫ్ 2, బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ తరహాలోనే దూసుకుపోతోంది. ఇక 27 రోజులకు గానూ హిందీలో రూ. 67 కోట్లు వసూలు చేయడం పెద్ద విశేషం. కర్ణాటకలోని భూతకోల కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీకి ప్రేక్షకులు భాషా బేధం లేకుండా అన్ని భాషల్లో కూడా బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఈ మూవీ ఊహించని విధంగా రికార్డు స్థాయిలో వసూళ్లని రాబడుతూ ట్రేడ్ పండితుల్ని సైతం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


సినిమా విడుదలై ఐదు వారాలవుతున్నా కూడా ఎక్కడా జోరు తగ్గడం లేదు. కన్నడ తెలుగు హిందీ భాషల్లో ఒకే జోరు చూపిస్తూ రికార్డు స్థాయి వసూళ్లని ఈ సినిమా రాబడుతోంది. ఇప్పటి వరకు రూ.400 కోట్ల దాకా గ్రాస్ ని వసూలు చేయడం విశేషం. బన్నీ నటించిన `పుష్ప` సినిమా లైఫ్ టైమ్ రన్ లో 350 కోట్లు వసూలు చేసింది. ఆ వసూళ్లని `కాంతార` సినిమా తక్కువ రోజుల్లోనే దాటడం విశేషం.ఇప్పటి వరకు కూడా ఈ మూవీ అన్ని భాషల్లో కలిపి వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 400 కోట్ల దాకా వసూళ్లని రాబట్టడం రికార్డు గా తెలుస్తోంది. ఒక చిన్న సినిమాగా విడుదలై సైలెంట్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ పాత రికార్డులు బద్దలు కొట్టి సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తుండటంతో త్వరలోనే ఈ మూవీ మ్యాజిక్ ఫిగర్ ని దాటడం ఖాయం అని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇక చూడాలి కాంతార సినిమా ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: