యంగ్ డైరెక్టర్స్ కు "యశోద" ఒక పరీక్ష.. నెగ్గుతారా !

VAMSI
సమంత లీడ్ రోల్ లో ఒక కొత్తరకం పాత్రలో నైటీనిచ్చిన సినిమా యశోద. ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన నాటి నుండి ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ ఎదురుచూసిన ప్రేక్షకులకు ఈ రోజు థియేటర్ లలో దర్శనమిచ్చింది. సమంత యశోద పాత్రలో నటించగా, ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీశర్మ, రావు రమేష్ లు వివిధ పాత్రలలో నటించారు. మ్యూజిక్ లెజెండ్ మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించగా తమిళ దర్శక ద్వయం హరి మరియు హరీష్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓవరాల్ గా సినిమా అవుట్ ఫుట్ ఏమిటన్నది మనమిప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒక మద్యతరగతి అమ్మాయి తన చెల్లెలి ఆపరేషన్ కోసం ఒక కంపెనీతో చేసిన కాంట్రాక్టు ప్రకారం సరోగసీ అనే విధానం ద్వారా బిడ్డను కనడానికి ఒక సీక్రెట్ ప్లేస్ లో జీవించాల్సి ఉంటుంది. అయితే అక్కడ జరిగే సంఘటనలు సమంతను భయబ్రాంతులకు గురిచేస్తాయి. అలా సమంత అక్కడ అసలు మీ జరుగుతోంది అన్న విషయాన్ని తెలుసుకునే క్రమంలో సరోగసి చాటున జరిగే రహస్యాలను తెలుసుకుం ఏమి చేసింది అన్నది సినిమా కథ.
అయితే ఈ సినిమా కథ మాత్రం ఇంతకు ముందు రవిబాబు తీసిన అమరావతిని పోలి ఉంటుంది. కానీ అమరావతీ సినిమా కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా బాగుంటుంది.. కానీ అమ్మ - గర్భం - బిడ్డ అన్న సున్నితమైన అంశాలను అల్లుకుని ఉండడంతో ప్రేక్షకులు సరిగా రిసీవ్ చేసుకోలేకపోయారు. సరిగా యశోద విషయంలోనూ అదే జరిగిందని చెప్పాలి. డైరెక్టర్స్ హరి మరియు హరీష్ లు కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేసినా మెయిన్ ప్లాట్ విషయంలో ప్రేక్షకులు సంతృప్తి చెందే అవకాశం లేదు. ఇదొక్కటే సినిమాలో మైనస్ గా నిలుస్తుంది... మిగిలిన ఏ విషయంలోనూ
యశోద ఏ మాత్రం తగ్గదు. థ్రిల్లర్ కు సరిపడా అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. అయితే సమంత యాక్టింగ్ కోసం ఒకసారి అయినా సినిమాను చూడవచ్చు.. ఈ కుర్ర దర్శకులకు యశోద పెట్టిన పరీక్షలో నెగ్గుతారా ? మరి ఈ సినిమా కలెక్షన్ ల పరంగా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: