సమంత జాతకం ప్రకారం త్వరలోనే ఆ ఘోరం తప్పదా..!?

Anilkumar
స్టార్ హీరోయిన్ గా దాదాపు దశాబ్దం పాటు సౌత్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది సమంత.  ప్రస్తుతం ఆమెకి ఈ సంవత్సరం అన్ని కష్టాలే వెంటాడుతున్నాయి.అయితే కేవలం ఒక చిన్న హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి బడా ఫ్యామిలీ అయినా అక్కినేని ఇంటికి కోడలు కావడమే పెద్ద సంచలనం.వీరు విడాకులు తీసుకునే ముందే వీరి వివాహ బంధం అంతగా బాగుండదు వీరి జాతకం బాలేదని ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి చెప్పారు.ఇక ఆయన ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండే ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుంటుంది అంటూ ఆయనపై మండిపడ్డారు.  

చివరికి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకొని ఆయన మాటలే నిజం చేశారు.సమంత విడాకులు తర్వాత ఆమెకు ఆఫర్లు వచ్చినట్టే వచ్చి వచ్చాక మాత్రం చాలా కష్టాలు వెంటాడుతున్నాయి.ఇదిలావుంటే  ప్రస్తుతం సమంత వరుస సినిమాలు చేస్తూ బిజీ అవుదామని ప్రయత్నిస్తోంది.  తాజాగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత అఫీషియల్ గానే ప్రకటించింది.ఇక ఈ వ్యాధి రాకన్నా ముందే ఆమెకు చర్మ సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఆమె వాటికి సంబంధించి ఎన్నో ట్రీట్మెంట్లు ఇప్పటికే తీసుకుంటుంది.

అయితే  ఇవన్నీ పక్కన పెడితే తాజాగా సమంత జాతక గురించి ప్రముఖ జ్యోతిష్కుడు హరి శాస్త్రి కొన్ని విషయాలు చెప్పారు.. హరి శాస్త్రి మాట్లాడుతూ.. సమంత జాతకం ప్రకారం ఆమె మరిన్ని చిక్కుల్లో పడక తప్పదు. ఇకపోతే సమంత సినీ కెరియర్ వృత్తిపరంగా ఆమె జాతకం బాగానే ఉన్నప్పటికీ వివాహ బంధం మాత్రం అంతగా బాగోదు.అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులే ఆమెకు కంటిన్యూ అవుతూ ఉంటాయి.అంతేకాదు  అలాగే ఆమెకు ఆరోగ్యపరమైన సమస్యలు మరిన్ని తలెత్తుతాయి.  సమంత వ్యక్తిగత జాతకంలో శని సంచారం ఉండడంవల్ల చైతుతో మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు. భవిష్యత్తులో నాగచైతన్య సమంత ఇద్దరు కలిసే అవకాశం కూడా లేదని హరి శాస్త్రి చెప్పుకోచ్చారు.ఇక ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: