ఆదాశర్మ సినిమా చుట్టూ వివాదం.. కారణం ఏమిటంటే..!!

Divya
టాలీవుడ్ లో నితిన్ తో కలిసి హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా మంచి పేరు సంపాదించింది హీరోయిన్ ఆదా శర్మ. ఈ చిత్రంలో ఘాటైన ముద్దులతో ప్రేక్షకులను బాగా అలరించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక చిత్రంలో నటిస్తోంది ఆ చిత్రం పేరు కేరళ స్టోరీ. ఈ చిత్రాన్ని సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రనికీ సంబంధించి ది కేరళ స్టోరీ అనే టీజర్ను తాజాగా విడుదల చేయడం జరిగింది. అయితే అలా విడుదలైన వెంటనే పలు వివాదాలు మొదలయ్యాయి కేరళ పరువుకు భంగం కలిగించే విధంగా ఈ చిత్రం ఉంటుందని టీజర్ ని చూస్తే మనకి అర్థమవుతుందని కేరళ ప్రేక్షకులు వాదిస్తూ ఉన్నారు.

కేరళ రాష్ట్రానికి చెందిన అమ్మాయిలు ఎంతోమంది నర్సులుగా మారి ఆఫ్ఘనిస్తాన్ తో పాటు పలు దేశాలకు కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ సమయంలో కొందరు కేరళకు చెందిన అమ్మాయిలు ముస్లిం గా మార్చి ఆఫ్ఘనిస్తాన్ కి పంపిస్తున్నారు అంటూ టీజర్ లో ఆదాశర్మ తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం తాను ఆఫ్ఘనిస్తాన్ దేశం జైల్లో ఒక ఉగ్రవాదిగా మారినట్లు తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం కేరళలో చాలా దుమారం రేపుతోందని చెప్పవచ్చు.
మొత్తం 32 వేల మంది కేరళకు చెందిన అమ్మాయిలు ఆఫ్ఘనిస్తాన్ లోని జైల్లో ఉగ్రవాదులుగా మగ్గుతున్నట్లు టీజర్ లో తెలియజేయడం జరిగింది. దీంతో అసలు వివాదం ఇక్కడే తెరలైపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. తప్పుడు లెక్కలు చెబుతూ కేరళ పరువు తీయడంతో పాటు కేరళ అమ్మాయి గురించి ఇలా తప్పుగా చూపిస్తున్నారు అంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి విజయన్ కి కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగిందట  అంతేకాకుండా డీజీపీకి కూడా ఈ విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో నటించిన ఆదాశర్మతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు కూడా పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: