పింక్ కలర్ డ్రెస్ లో మైమరపిస్తున్న పూర్ణ..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ పూర్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూర్ణ ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరోయిన్ పాత్రల్లో నటించడం మాత్రమే కాకుండా , ఇతర ముఖ్యమైన పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే పూర్ణ ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయిన 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లో కూడా కీలక పాత్రలో నటించింది.
 

ఈ వెబ్ సిరీస్ లో పూర్ణ తో పాటు ఈషా రెబ్బ ,  పాయల్ రాజ్ పూత్ లు కూడా ముఖ్యమైన కీలకపాత్రలో నటించారు  ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే పూర్ణ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయిన అఖండ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించి , తన పాత్రతో ప్రేక్షకులను అలరించింది.
 

ఇది ఇలా ఉంటే సినిమాలు , వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా పూర్ణ ఈటీవీ లో ప్రసారం అవుతున్న డీ డాన్స్ ప్రోగ్రాం కు జడ్జిగా కూడా వ్యవహరిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో , వెబ్ సిరీస్ లతో , టీవీ షో లతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు కొనసాగిస్తున్న పూర్ణ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ , తనకు సంబంధించిన అనేక ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా కూడా పూర్ణ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా పూర్ణ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే క్లాస్  లుక్ లో ఉన్న పింక్ కలర్ డ్రెస్ ను వేసుకొని , డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం పూర్ణ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: