"సార్" మూవీ ఫస్ట్ సింగిల్ విడుదల టైమ్ పిక్స్..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న ధనుష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధనుష్ ఇప్పటికే ఈ సంవత్సరం తిరు మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు  ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ధనుష్ ఆఖరుగా నేనే వస్తున్నా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. దానితో నేనే వస్తున్నా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ధనుష్ "సార్" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు మరియు తమిళ భాషలలో రూపొందుతుంది. ఈ మూవీ కి టాలీవుడ్ క్రేజీ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తూ ఉండగా , మోస్ట్ క్రేజీ హీరోయిన్ సంయుక్త మీనన్ ఈ మూవీ లో ధనుష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.
 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి మొదటి పాటను ఈ రోజు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ యూనిట్ సార్ మూవీ నుండి మొదటి పాటను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: