కమల్ టైమ్ మళ్ళీ వచ్చిందా!!

P.Nishanth Kumar
గత కొన్ని రోజులుగా కమల్ హాసన్ తన సినిమాల ద్వారా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించ లేకపోయాడు అని చెప్పాలి. ఎప్పుడైతే విక్రమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందో అప్పటినుంచి కమల్ తన టైం మళ్ళి వచ్చినట్లుగా వరుస సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. విక్రమ్ సినిమాలో ఆయన నటించిన తీరుకు ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఫీదా అయిపోయారు. నటన విషయంలో అందరి కంటే ఒక మెట్టు ఎక్కువగానే కమల్ గురించి చెప్పుకుంటూ ఉంటారు.

ఆ విధంగా ఆయన తన ప్రతి సినిమాలో నటన ద్వారా ప్రేక్షకులను ఆనంద పరిచినా కూడా సినిమా ప్రేక్షకులను అలరించకపోవడంతో ఒకసారిగా ఆయన క్రేజ్ భారీ స్థాయిలో పడిపోయింది. అయితే విక్రమ్ సినిమా ఆయనకు పోయిన క్రేజ్ ను తిరిగి తీసుకువచ్చింది అని చెప్పాలి. ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడం ఆయనకు ఎంతో కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆయన వరుస యాక్షన్ సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమాను మొదలుపెట్టిన కమల్ హాసన్ ఇప్పుడు మరొక యాక్షన్ భరితమైన సినిమా చేయ డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చాలా రోజుల తరువాత మణిరత్నం దర్శకత్వంలో మరొక సినిమాను కూడా చేయబోతున్నాడు. ఆ విధంగా వరుసగా క్రేజీ ప్రాజెక్టుల పై సైన్ చేస్తూ మునుపటి కమలహాసన్ ను గుర్తుకు తీసుకువస్తున్నారు. మరి ఆయనకు ఈ సినిమాలతో ఆయన మరిన్ని విజయాలను తీసుకువస్తే మాత్రం మరొకసారి ఆయన శకం మొదలవుతుంది అని చెప్పాలి. గతంలో రజినీకాంత్ తో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూ సినిమాలను తీసిన కమలహాసన్ ఆ తరువాత రజినీకాంత్ కి తగ్గట్టుగా సినిమాలు చేయక వెనకబడిపోయారు.మరి ఇప్పుడు అయన సరైన పోటీ ఇస్తున్న నేపథ్యంలో రజినీకాంత్ ఎలాంటి సినిమాలను చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: