ప్రభాస్... మారుతి మూవీ షూటింగ్ అన్ని రోజుల్లోనే పూర్తికానుందా..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ తరసన ముగ్గురు హీరోయిన్ లు నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ నిధి అగర్వాల్ మరియు మాళవిక మోహన్ లను ప్రభాస్ సరసన హీరోయిన్ లుగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. మరొక హీరోయిన్ ను కూడా మరి కొద్ది రోజుల్లోనే ఈ మూవీ యూనిట్ ఫైనల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరియు మరొక కీలకమైన పాత్రలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ మూవీ కనిపించే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ను మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ఒక వార్త వైరల్ అవుతుంది. అలాగే ఈ మూవీ హారర్ కామెడీ నేపథ్యం లో తెరకెక్కబోతున్నట్లు , ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం ఒకే సెట్ లో జరగబోతున్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

ఈ మూవీ ని దర్శకుడు మారుతి ఫుల్ స్పీడ్ లో తెర , కేవలం 90 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో దర్శకుడు మారుతి అదిరిపోయే యాక్షన్స్ సన్నివేశాలను కూడా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లోని యాక్షన్ సన్నివేషాలు ఈ మూవీ కి హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: