"ఊర్వశివో రాక్షసివో" మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థలు..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు శిరీష్ "గౌరవం" మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ మంచి విజయం సాధించలేదు. ఆ తర్వాత అల్లు శిరీష్ పలు మూవీ లలో హీరోగా నటించాడు. అందులో శ్రీరస్తు శుభమస్తు మూవీ ఈ హీరో కు మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందించింది. శ్రీరస్తు శుభమస్తు మూవీ కి పరుశురామ్ దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో లావణ్య త్రిపాఠి , అల్లు శిరీష్ సరసన హీరోయిన్ గా నటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు శిరీష్ "ఊర్వశివో రాక్షసివో" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించగా ,  రాకేష్ శశి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సునీల్ , వెన్నెల కిషోర్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 4 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ప్రస్తుతం ఊర్వశివో రాక్షసివో మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఊర్వశివో రాక్షసివో మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలు అయినటు వంటి ఆహా మరియు నెట్ ఫ్లిక్స్ సంస్థలు దక్కించుకున్నట్లు ,  ఈ మూవీ థియేటర్ రన్ కొన్ని వారాలు పూర్తి అయిన తర్వాత ఈ మూవీ ని ఆహా మరియు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: