ఆదిత్య 369.. ఆదిత్య 999 మ్యాక్స్.. సినిమాపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య..!!
అనిల్ ఇప్పటికే స్క్రిప్ట్ పరంగా ఈ సినిమా కథను పూర్తి చేసినట్లుగా సమాచారం.కేవలం బాలకృష్ణ కోసమే ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో కి బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ టాక్ షోలో బాలయ్య పలు ఆసక్తికరమైన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటున్నారు. మరి ఈ వేదికపై ఆదిత్య 369 సినిమా సీక్వెల్ పై కూడా మాట్లాడడం జరిగింది. ఈ సినిమా సీక్వెల్ ను ఆదిత్య 999 మ్యాక్స్ అనే పేరుతో తెరకెక్కించబోతున్నట్లు తెలియజేశారు.
అంతేకాకుండా ఈ సినిమా కథని తానే స్వయంగా సిద్ధం చేయబోతున్నట్లుగా కూడా తెలియజేయడంతో అభిమానులు కూడా ఈ సినిమా పైన ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకువెళ్లబోతున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది బాలయ్య. అయితే డైరెక్టర్ ఎవరు అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మొదటిసారి బాలకృష్ణ ఈ సినిమా కోసం కథను సిద్ధం చేయబోతున్నారు దీంతో బాలయ్య అభిమానులకు కూడా ఈ సినిమా చాలా స్పెషల్ అని కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరి బాలయ్య ఏం చేస్తారో చూడాలి.