ధనుష్ "సార్" మూవీ ఫస్ట్ సాంగ్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి ధనుష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధనుష్ ఇప్పటికే అనేక విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ధనుష్ "తిరు" అనే మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్నాడు. తిరు మూవీ లో నిత్యా మీనన్ ,  రాసి కన్నా ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. తిరు మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ధనుష్ ఆ తర్వాత నేనే వస్తున్నా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ధనుష్ "సార్" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.
 

ఈ మూవీ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తూ ఉండగా , సంయుక్తా మీనన్ ఈ మూవీ లో ధనుష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ సార్ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ ను 10 నవంబర్ 2022 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ  సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ కి జీ వి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: