యశోద మూవీని అన్ని కోట్ల ప్రాజెక్ట్ గా ప్రారంభిస్తే... అన్ని కోట్లతో పూర్తి అయింది... కృష్ణ ప్రసాద్..!

Pulgam Srinivas
మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీమనులలో ఒకరు అయినటు వంటి సమంత తాజాగా యశోద అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఉన్న ముకుందన్ ,  వరలక్ష్మి శరత్ కుమార్ , రావు రమేష్ , మురళీ శర్మ కీలక పాత్రలో నటించగా ,  మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. హరి శంకర్ ,  హరీష్ నారాయణ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ,  శివలింగ కృష్ణ ప్రసాద్ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని నవంబర్ 11 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ ,  మలయాళ , హిందీ భాషల్లో థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా యశోద మూవీ నిర్మాత శివలింగ కృష్ణ ప్రసాద్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా యశోద మూవీ నిర్మాత శివలింగ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ... యశోద మూవీ స్క్రిప్ట్ ను విన్నప్పుడు చాలా థ్రిల్ అయ్యాను.  సరోగసి స్కాం ,  సమంత పాత్ర అందరికీ నచ్చుతుంది. ఈ మూవీ ని 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ గా ప్రారంభించాం ,  కానీ కథకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ వస్తుంది అని భావించిన నేపథ్యంలో ఈ మూవీ 40 కోట్ల ప్రాజెక్ట్ అయ్యింది. అవుట్ పుట్ చూసి చాలా రిలాక్స్ అయ్యాను అని తాజాగా యశోద మూవీ ప్రొడ్యూసర్ శివలింగ కృష్ణ ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు యశోద మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో , ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ట్రైలర్ లో సమంత తన యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టింది. మరి యశోద మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: