సినిమాల్లోకి బన్నీ వైఫ్ ఎంట్రీ..రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Satvika
అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు..మంచి కోడలుగా, భార్యగా,తల్లిగా తన బాధ్యతలను నిర్వహిస్తూ అందరి మన్ననలను పొందింది.అయితే త్వరలో ఆమె సినిమాలోకి రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు స్నేహ రెడ్డికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో తన పిల్లల అల్లరి వీడియోలు షేర్ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు తన స్టైలిష్ ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల స్నేహ రెడ్డి తన ట్రెండీ ఫోటోషూట్స్ తో వార్తలో నిలుస్తుంది. స్టైలింగ్ అండ్ డ్రెస్సింగ్ లో తన భర్తకి ఏమాత్రం తీసుకుపోదని నిరూపిస్తూ వస్తుంది.

అందుకే సినిమాలో నటించడానికి ప్రయత్నాలు చేస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల స్నేహానికి మలయాళ ఇండస్ట్రీ నుంచి సినీ ఆఫర్ వచ్చిందని ఓ పెద్ద హీరో సినిమాలో నటించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే బన్నీ భార్యకు నటనపై ఆసక్తి ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అల్లు స్నేహానికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఆమెకు పెళ్ళికి ముందు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇంస్టాగ్రామ్ లో ఆమెకు మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. ఈమధ్య ఫోటోషూట్స్ ఎక్కువగా చేస్తుండటంతో స్నేహకు నటనపై ఆసక్తి ఉందని చాలా మంది అంతున్నారు.

బన్నీ షూటింగ్స్ లో అంత బిజీగా ఉన్న ఫ్యామిలీకి టైం కేటాయిస్తూ ఉంటారు. వీలు కుదిరినప్పుడల్లా భార్య పిల్లలను హాలిడే కి తీసుకెళ్లి ఎంజాయ్ చేసి వస్తుంటారు. పుష్ప సినిమా తర్వాత తమ ఫ్యామిలీతో గడపడానికి ఉపయోగించుకున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ ప్రస్తుతం దానికి మించి ఉండేలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. మరోవైపు బన్నీ స్నేహల కూతురు అల్లు అర్హ శాకుంతలం సినిమాతో తెరంగేట్రం చేయబోతుంది. అల్లు ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న నాలుగవ తరం వారసురాలిగా అర్హ నిలిచింది..ఇక ఈ వార్తలో నిజమేంత వుందో తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: