అయ్యో! ప్రభాస్ కు ఘోర అవమానం...!!

murali krishna
సున్నితమైన అంశాలను టచ్ చేస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరో అభిమానుల జోలికి పోకూడదు. వాళ్ళ మనోభావాలు అస్సలు దెబ్బతీయకూడదు.
తమ హీరోని ఎవరైనా అవమానించారని తెలిస్తే వాళ్లకు ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తారు. గతంలో చాలా మందికి ఈ అనుభవమైంది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. ఆ సంస్థ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ వివాదానికి కారణమైందని తెలుస్తుంది.. ప్రభాస్ సాహో సినిమాను కించపరిచేలా చేసిన కామెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ గుండెల్లో మంట రగిలించింది.
నెట్ ఫ్లిక్స్ ఇండోనేషియా సాహో మూవీలోని ఒక యాక్షన్ సీన్ షేర్ చేసి… ఇది కూడా యాక్షనేనా అని కామెంట్ పెట్టింది. ఈ విషయం ప్రభాస్ అభిమానుల వరకూ చేరింది. ప్రభాస్ ని అవమానిస్తున్నట్లున్న ఆ పోస్ట్ తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో నెట్ఫ్లిక్స్ కి ఇండియాలో చరమగీతం పాడతామని శబధం చేస్తున్నారట.. బ్యాన్ నెట్ఫ్లిక్స్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. తమ మొబైల్స్ నుండి నెట్ఫ్లిక్స్ యాప్స్ తొలగిస్తూ వీడియోలు తీసి  మరీ పోస్ట్ చేస్తున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ చర్యలకు నెట్ఫ్లిక్స్ ఇండియా వణికిపోతుంది. ఈ వివాదం ఎక్కడకెళుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఇండియాలో నెట్ఫ్లిక్స్ బిజినెస్ అంతంత మాత్రంగా ఉంది. సబ్స్క్రైబర్స్ ని ఆకర్షించలేక నానా పాట్లు పడుతుంది. ఈ వివాదాలతో నెట్ఫ్లిక్స్ బిజినెస్ మరింత డామేజ్ కావొచ్చు. అనవసరంగా ప్రభాస్ అభిమానులను గెలికి లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుకున్నారట.. సాహో ప్రభాస్ కెరీర్ లో అతిపెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాహో అనుకున్న స్థాయిలో అయితే ఆడలేదు.
నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సాహో వరల్డ్ వైడ్ రూ. 460 కోట్ల వరకూ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సాధించింది. హిందీలో సాహో హిట్ కావడం విశేషం. సాహో హిందీ వర్షన్ రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందట.. కాగా బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ నిరాశపరిచాయి. దీంతో ఆయన ఒక సాలిడ్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారట . వచ్చే ఏడాది ప్రభాస్ నుండి ఆదిపురుష్, సలార్ విడుదల కానున్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: