మహేష్ నే కాదు.. ఆ హీరోని కూడా కాపీ కొడుతున్న తలపతి?

Purushottham Vinay
ఫేమస్  తమిళ స్టార్  హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వారిసు'. తెలుగులో ' వారసుడు' గా రిలీజ్ అవుతుంది. టాలీవుడ్ స్టార్  డైరెక్టర్  వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాని ఎక్కువమందికి నచ్చే అవకాశం లేక చూడకపోవచ్చు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి పెద్ద సినిమాల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఈ వారసుడు సినిమాపై లేదు. ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు కావడంతో టాలీవుడ్‌లో కాస్త రెస్పాన్స్ అనేది ఆటోమేటిక్ గా వస్తోంది. కానీ ఈ సంక్రాంతి పండగకి దానికి పోటీగా వస్తున్న సినిమాలను తట్టుకొని నిలబడటం మాత్రం చాలా కష్టమే. ఇంకా అంతేకాకుండా ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ అయితే కేవలం విజయ్ ఫ్యాన్స్‌కి తప్ప మిగితావారికి ఏమంతా గొప్పగా అనిపించడం లేదట.


టాలీవుడ్  సూపర్  స్టార్ మహేష్ నటించిన మహర్షి సినిమాతో వీటిని లింక్స్ చేసి ట్రోల్ చేస్తున్నారట.అందులోని మహేష్  లుక్స్, డ్రెస్ లను ఇంకా మహేష్ స్టైల్  ని విజయ్  కాపీ కొడుతున్నట్లు అర్ధమవుతుంది.అందులోని వేషధారణలు కూడా అచ్చు గుద్దినట్లు ఉన్నాయి. ఆ రెండు ఫొటోలను పోలుస్తూ మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక రేంజిలో ఆడుకుంటూ విజయ్ ఫ్యాన్స్ ని ట్రోల్ చేస్తున్నారు. కేవలం మన మహేష్ బాబునే కాదండోయ్ ఆఖరికి బన్నీని కూడా కాపీ కొడుతున్నాడు తలపతి. అల వైకుంఠపురంలో బన్నీ వేసిన స్టెప్స్  ని విజయ్  తన సినిమాలో తాజా పాట అయిన రంజితమేలో చూడొచ్చు. అందులో బుట్టబొమ్మ వైబ్స్ బాగా కనిపిస్తున్నాయి. దీంతో తలపతి విజయ్ ని మహేష్ ఫ్యాన్స్ ఇంకా బన్నీ ఫ్యాన్స్ కాపీ స్టార్ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో గట్టి వార్ అనేదే నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: