చీర కట్టులో ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటీమణులలో ఒకరు అయినటు వంటి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇచట వాహనంలో నిలపరాదు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన నటనతో , అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో ఎచట వాహనములు నిలపరాదు మూవీ తర్వాత మీనాక్షి చౌదరి కి ఏకంగా మాస్ మహారాజ రవితేజ హీరోగా తేరకెక్కిన ఖిలాడి మూవీ లో ఆఫర్ వచ్చింది. అందులో భాగంగా ఖిలాడి మూవీ లో రవితేజ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మకు ఖిలాడీ మూవీ ద్వారా మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర లభించలేదు.
 

ఖిలాడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ , ఈ మూవీ లో మీనాక్షి చౌదరి తన అంద చందాలతో మాత్రం ప్రేక్షకులను బాగానే కట్టిపడేసింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అడవి శేషు హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతోంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ టీజర్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇలా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా మీనాక్షి చౌదరి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా మీనాక్షి చౌదరి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీని కట్టుకొని ,  రెడ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి.  మెడలో ఒక లాకెట్ ను వేసుకొని చాలా ట్రెడిషనల్ గా ,  క్లాస్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి కి సంబంధించిన ఈ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: