బర్గ్ డే స్పెషల్: ఇలియానా కెరీర్ నాశనం అవ్వడానికి గల కారణాలు ఇవే..??

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ఇలియానాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. అంతేకాదు ముఖ్యంగా తన అందంతో నడుము అందాలతో కుర్రకారులను సైతం నిద్రలేకుండా చేస్తూ ఉండేది.ఇకపోతే తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటిసారి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్గా పేరు సంపాదించింది. ఇలియానా 10 సంవత్సరాల వయసులోనే గోవాలో పర్రా గ్రామంలో స్థిరపడిపోయారట. కాగా ఇలియానా ర్యాంపు షోలో పాల్గొంటూ తన అందాలతో మురిపించేది. అంతేకాకుండా ఇక పలు యాడ్లలో కూడా నటించిందట.

 అలా బాలీవుడ్ పరిశ్రమలో అవకాశాలు కోసం తన కెరీయర్ని ప్రారంభించిన సమయంలోనే.. డైరెక్టర్ తేజ తన చిత్రంలో అవకాశం ఇచ్చారట.అయితే కొన్ని కారణాల చేత ఆ సినిమా ఆగిపోవడంతో అదే సమయంలో తన దేవదాస్ సినిమాలోని హీరోయిన్ కోసం వెతుకుతున్న వైవిఎస్ చౌదరి ఆమెను ఎంపిక చేయడం జరిగిందట. ఇక అలా ఇలియానా మొదటిసారిగా దేవదాసు సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత పోకిరీ సినిమాతో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఇక ఈ సినిమాతో ఇలియానా కాల్ సీట్స్ కూడా కాస్ట్లీ గా మారిపోయాయి.

అటు తర్వాత పలు తమిళ, కన్నడ చిత్రాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.అయితే ఇలియానా కలలు కన్నా బాలీవుడ్ ఎంట్రీ రణబీర్ కపూర్ బర్ఫీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.అయితే తనకలే తన కెరీర్ను నాశనం అవ్వడానికి కారణమైందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక  ఎంత చేత అంటే బాలీవుడ్లో మొదటి చిత్రం ఇలియానాకు మంచి హిట్ ను దక్కింది.అయితే  ఆ తర్వాత హిందీ చిత్ర సీమలోని రాణిస్తూ సాగింది.ఇక  దీంతో తెలుగులో సినిమా అవకాశాలు వస్తూ ఉన్న వాటికి నో చెబుతూ వచ్చిందనే వార్తలు కూడా వినిపించాయి. తర్వాత నెమ్మదిగా బాలీవుడ్ లో వరుస ప్లాపులు పలకరించాయి.. దీంతో మళ్లీ తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు చూసింది. ఆ తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో అవకాసం రాగ సక్సెస్ కాలేకపోయింది.అయితే  ప్రస్తుతం సినిమాలు చేతిలో లేక కేవలం ఫోటోషూట్లకు ఫోజులు ఇస్తే కుర్రాలను పిచ్చోళ్లను చేస్తోంది ఈ ముద్దుగుమ్మ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: