ఏకంగా ముఖ్యమంత్రి నే పెళ్లి చేసుకున్న ఆ హీరోయిన్...!!

murali krishna
తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన భద్రాద్రి రాముడు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ మంగళూరు బ్యూటీ రాధికా కుమారస్వామి గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు.
అయితే రాధికా కుమారస్వామి తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ సినీ ప్రేక్షకులకు మాత్రం బాగానే గుర్తుండిపోయింది. ఈమె ముఖ్యంగా కన్నడ అనువాద చిత్రాలలో ఎక్కువగా నటించింది. అయితే సినిమా పరిశ్రమలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధికా కుమారస్వామి నిజ జీవితంలో మాత్రం ఎన్నో బాధలు ఉన్నాయనే చెప్పవచ్చు.. ఇందులో ముఖ్యంగా 2000 వ సంవత్సరంలో ప్రేమించి ఎన్నో ఆశలతో రతన్ కుమార్ ను పెళ్లి చేసుకున్న రాధికా కుమారస్వామి.. తన భర్త రతన్ కుమార్ అనుకోకుండా 2002లో మృతి చెందారు. దీంతో రాధిక కుమారస్వామి తీవ్రమైన స్థాపానికి గురైందట..
 
ఆ తర్వాత కుటుంబ సభ్యులు అండదండలతో తేరుకొని మళ్ళీ తన సినీ జీవితంపై దృష్టి పెట్టిన ఈమె.. కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని 2007లో వివాహం చేసుకుందట . ప్రస్తుతం రాధిక తన భర్త కుమారస్వామికి ఇటు రాజకీయాలలో సహాయం చేస్తూ అటు కుటుంబ బాధ్యతలను కూడా చక్కబెడుతుంది. పెళ్లయిన తర్వాత కూడా రాధిక కుమారస్వామి అడపాదడపా చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు పలు చిత్రాలకు నిర్మాత , సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. తెలుగులో ఈమె నటించిన భద్రాద్రి రాముడు , అవతారం సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
 
కుమారస్వామి వివాహం చేసుకున్న తర్వాత కన్నడలో కాంట్రాక్ట్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిందట.. అంతేకాదు భైరదేవి అనే ఫాంటసీ చిత్రంలో కూడా నటించింది. ఇప్పటికీ కూడా అడప దడప సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా మొదటి భర్త చనిపోయి ఆ బాధ నుంచి చేరుకొని ప్రస్తుతం తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. మళ్లీ తెలుగు సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: