త్వరలో పెళ్లికి కి రెడీ అవుతున్న నటుడు విశాల్..!!

murali krishna
నటుడు విశాల్‌.. , పాలిటిక్స్‌తోనే కాదు నిత్యం పెళ్లి పుకార్లతోనూ వార్తల్లో ఉంటాడీ కోలీవుడ్‌ యాక్షన్‌ హీరో. గతంలో ఎన్నోసార్లు ఈ హీరో పెళ్లి గుప్పుమన్నాయి.
ముందు నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌తో ప్రేమ వ్యవహారం అంటూ ప్రచారం జోరుగా సాగింది అని మనకు తెలుసు,. పెళ్లి కూడా చేసుకుంటారని రూమర్లు వచ్చాయి. అయితే అవేవీ నిజం కాలేదు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చెందిన యువతితో విశాల్‌ నిశ్చితార్థం కూడా జరిగింది అని టాక్ వచ్చింది. అయితే పెళ్లిపీటలెక్కకుండానే అది క్యాన్సిల్‌ అయిపోయింది. ఆతర్వాత పలు సార్లు విశాల్‌ పెళ్లిపై పుకార్లు ఇలానే వచ్చాయి. అయితే అవి వదంతులుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్‌ అభినయతో విశాల్‌ ప్రేమలో ఉన్నాడని  మళ్ళీ టాక్స్ వస్తున్నాయి. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సామాజిక మాధ్యమాలు హోరెత్తుతున్నాయి. రవితేజ, అల్లరి నరేష్‌, శివబాలాజీ నటించిన శంభో శివ శంభో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది  నటి అభినయ. వినికిడి సమస్యలతో పాటు మాటలు రాని ఈ అందాల తార ఈ లో మాస్‌ మహరాజా చెల్లెలిగా నటించి  అందరినీ మెప్పించింది. అలాగే నేనింతే, కింగ్‌, దమ్ము, డమరుకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ధ్రువ, రాజుగారి గది, ఇటీవల వచ్చిన సీతారామం చిత్రాల్లోనూ గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది ఈ బ్యూటీ
కాగా ప్రస్తుతం విశాల్‌ హీరోగా నటిస్తున్న మార్క్‌ ఆంటోనీ చిత్రంలో లీడ్‌రోల్‌ పోషిస్తోంది అభినయం. ఈనేపథ్యంలో విశాల్‌తో ప్రేమ, పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఈ ప్రచారంపై విశాల్‌ ఇప్పటివరకు స్పందించలేదు కానీ, నటి అభినయ మాత్రం రియాక్ట్‌ అయ్యింది. 'మార్క్‌ ఆంటోనీ లో విశాల్‌కు భార్యగా నటిస్తున్నాను. రీల్‌ లైఫ్‌లో భార్యగా నటిస్తే రియల్‌ లైఫ్‌లో భార్య కాగలమా?' అంటూ ఈ పుకార్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో విశాల్‌, అభినయల ప్రేమ, పెళ్లి అనే పుకార్లకు పుల్‌స్టాప్‌ పడినట్టు అయింది మరీ. ఇక విశాల్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం అతను లాఠీ చిత్రంలో నటిస్తున్నాడు. దీంతోపాటు తుప్పరివాలన్‌ మార్క్  ఆంటోనీ లు  చిత్రాలు చేస్తున్నారు ఈ నటుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: