'వరిసు' సినిమా కు పోటి మాములుగా లేదుగా..!!

murali krishna
టాలివుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి మహర్షి సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని కోలీవుడ్ సూపర్ స్టార్ ను లైన్లో పెట్టాడు అని చెప్పొచ్చు. వంశీ పైడిపల్లి విజయ్ దళపతి కాంబోలో వారసుడు సినిమా తెరకెక్కుతుంది.
దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది అంటా మరీ.
తమిళ్ లో 'వరిసు' తెలుగులో 'వారసుడు' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు బాగా పీక్స్ కు చేరుకున్నాయి. వంశీ పైడిపల్లి తాజాగా వారసుడు కంప్లీట్ తమిళ్ సినిమా అని బలంగా చెప్పాడు.. ఈ సినిమా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తామని  కుడా తెలిపాడు.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు అని టాక్
అయితే అప్పుడు రిలీజ్ అయితే అది ఖచ్చితంగా రాంగ్ టైం అవుతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు మరీ. ఇప్పటి వరకు తెలుగులో అయితే ఈ సినిమాపై పెద్ద బజ్ అనేది రాలేదు.. పైగా ఈసారి సంక్రాంతి బరిలో ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్, వీరసింహ రెడ్డి సినిమాతో బాలయ్య, వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి బరిలో దిగబోతున్నారు. దీంతో విజయ్ వారసుడు సినిమాపై కన్నెత్తి చూసే ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
తమిళ్ లో అయితే ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి అని చెప్పొచ్చు.. కానీ విజయ్ వరిసు సినిమాకు పోటీగా అజిత్ కుమార్ తునివు కూడా రిలీజ్ కాబోతుంది.. అందుకే వారసుడు ఒకవేళ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ కు గండి పడక తప్పదు మరీ. అలా కాదు అని ప్లాప్ టాక్ వస్తే ఇక ఈ సినిమా గతి చెప్పాల్సిన పని లేదు.. దిల్ రాజు భారీ బడ్జెట్ కు గండి పడినట్టే.. చూడాలి మరి చివరకు ఈ సినిమా వెనక్కి తగ్గుతుందో లేదో చూడాలి మరీ .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: