ఆ విషయం పై పెద్దలు కాస్త ఆలోచించాలి :బాలకృష్ణ

murali krishna
మనిషి దైనందిన జీవితంలో సినిమా భాగమైందని, అందుకే వారికి మంచి చిత్రాలు అందించేలా సినీ పెద్దలు ఆలోచించాలని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారట.
ఊర్వశివో రాక్షసివో' (Urvasivo Rakshasivo) ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడారు. అల్లు శిరీష్‌ (Allu Sirish) హీరోగా దర్శకుడు రాకేశ్‌ శశి తెరకెక్కించిన చిత్రమిది. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో ఈ సినిమా నవంబరు 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటైన ఈవెంట్‌కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారట .
బాలకృష్ణ మాట్లాడుతూ.. ''అరవింద్‌గారి కుటుంబం, మా కుటుంబానికి మధ్య మంచి అనుబంధం ఉంది. మా కాంబినేషన్‌లో వచ్చిన 'అన్‌స్టాపబుల్‌' టాక్‌ షో.. విశేష ప్రేక్షకాదరణ పొందింది. నేను తెరంగేట్రం చేసిన సంవత్సరంలోనే అల్లు వారి 'గీతా ఆర్ట్స్‌' నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. ఎన్నో గొప్ప చిత్రాలు ఆ బ్యానర్‌లో తెరకెక్కాయి. 'ఊర్వశివో రాక్షసివో' సినిమాలో శిరీష్‌ రొమాంటిక్‌గా నటించాడు. నిజ జీవితంలోనూ అలానే ఉంటాడేమో అనిపిస్తోంది (నవ్వుతూ). సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా. దర్శకుడు రాకేశ్‌ శశికి నా అభినందనలు. మనిషి దైనందిన జీవితంలో సినిమా భాగమైంది. అందుకే ప్రేక్షకులకు ఎలాంటి చిత్రాలు అందించాలనే విషయంపై సినీ పెద్దలు ఆలోచించాలి. ప్రేక్షకులు, నా అభిమానులకు ఇష్టంలేనిదాన్ని నేను ఎప్పుడూ చేయాలనుకోను. ఏ నటుడు ఎలాంటి పాత్రలకు సెట్‌ అవుతారో అవే చేయాలి. 'నేను చేయలేని పాత్ర లేదు' అని ఏ నటుడూ అనుకోకూడదు. నటన అంటే పరకాయ ప్రవేశం. మనసు పెట్టి చేయాలి'' అని అన్నారు. వేడుకకు హాజరైన యువ దర్శకులు చందు మొండేటి, వశిష్ఠ, మారుతి, పరశురామ్‌ తదితరులు విభిన్న కథలతో కొత్త ఒరవడి తీసుకొచ్చారని బాలకృష్ణ అభినందించారట..

''ఈ చిత్ర దర్శకుడితో నాది ఆరేళ్ల పరిచయం. ఆయన తెరకెక్కించిన మూడో సినిమా ఇది. రాకేశ్‌ పని రాక్షసుడు. సంగీత దర్శకులు అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్‌తో కలిసి పనిచేయాలన్న నా కల ఈ చిత్రంతో నెరవేరింది. ఈ సినిమా స్క్రిప్టును ఇచ్చిన తమ్మారెడ్డి భరద్వాజగారికి, నిర్మాతలు ధీరజ్‌, విజయ్‌లకు థ్యాంక్స్‌. అను ఇమ్మాన్యుయేల్‌లోని అసలైన నటిని ఈ సినిమాలో చూస్తారు. నా కోసమే కాదు, తన కోసమూ ఈ చిత్రం హిట్‌ కావాలని ఆకాంక్షిస్తున్నా'' అని శిరీష్‌ అన్నారట.
 
''నేను తెరకెక్కించిన 'సోలో' సినిమా నచ్చటంతో శిరీష్‌ నాకు ఓ అవకాశం ఇచ్చాడు. మేం కలిసి పనిచేసిన చిత్రం 'శ్రీరస్తు శుభమస్తు'. అప్పుడు శిరీష్‌ నన్ను సపోర్ట్‌ చేయడం వల్లే నేనిప్పుడు 'సర్కారు వారి పాట' (మహేశ్‌బాబు హీరోగా) వరకూ వచ్చా'' అని దర్శకుడు పరశురామ్‌ అన్నారు. ''కల్మషంలేని వ్యక్తి బాలకృష్ణ. ఆయన ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా గురించి నాకు పూర్తిగా తెలుసు. మంచి విజయం అందుకుంటుందనే నమ్మకం ఉంది'' అని దర్శకుడు మారుతి చెప్పారట

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: