బిగ్ బాస్ లోకి బ్యూటిఫుల్ యాంకర్,సీక్రెట్ రూమ్ లోకి సూర్య..?

murali krishna
ఈ రెండు మూడు వారాల నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కాస్త ఇంట్రెస్టింగ్ గా తయారయ్యింది.  టాస్క్ లతో పాటు, నాగార్జున వీకెండ్ గేమ్స్ తో కాస్త రేటింగ్స్ పెరుగుతున్నట్ట తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే బిగ్ బస్ హౌస్ లోకి బ్యూటిఫుల్ యాంకర్ ను  వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంటర్ చేయబోతున్నారట మేకర్స్. రసవత్తరంగా సాగుతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 6. ఇక ఈ 8 వ వారం ఇంకా ఇంట్రెస్టింగ్ గా సాగింది. 9 వారం ఎలా ఉంటందా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వీకెండ్ నాగార్జున ఇంట్లోవాళ్లకు గట్టిగానే క్లాస్ పీకాడు. ఇక 8 వారం ఇంట్లో నుంచి సూర్యును ఎలిమినేట్ చేశారు. అయితే శనివారమే ఎలిమినేషన్ అయిపోవడంతో.. ఈ విషయంలో అంతా అనుమానం వ్యాక్తం అవుతోంది.
 
అంతే కాదు సూర్యను సీక్రేట్ రూమ్ లో ఉంచి.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపడానికి రంగం సిద్దం అయ్యిందన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. అదంతా ఈరోజు ఎపిసోడ్ లో తెలిసిపోనుందంటున్నారు బిగ్ బాస్ లవ్వర్స్ . సూర్య చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. అందులోను లవ్ ట్రాక్ లు నడిపిస్తూ.. కాస్త మసాలా తో పాటు పులిహోర కూడా కలుపుతున్నాడు హౌస్ లో.. అటువంటిది సూర్యను అంత తొందరగా బిగ్ బాస్ వదులుకోవడం కష్టమనే చెప్పాలి.
 
దీంతో సూర్య సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళాడని ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది. . అంతేకాదు త్వరలోనే బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని  తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బుల్లి తెర యాంకర్ వర్షిణి బిగ్ బాస్ తెలుగు  సీజన్ 6 లోకి   వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
 బిగ్ బాస్ సీజన్ 6 వర్షిణి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫిక్స్ అయినట్టే అంటున్నారు సినీ జనాలు. ఇప్పటికే ఆమె క్యారంటైన్ కూడా కంప్లీట్ అయ్యిందట.  ఆమో  హౌస్ లోకి ఎంట్రీ  గ్రాండ్ గా  ఇవ్వబోతుందని తెలుస్తోంది.  ..ఎంట్రీ ఇవ్వడంతోనే కంటెస్టెంట్స్ పై బిగ్ బాంబ్ పేల్చబోతుందని తెలుస్తుంది.ఇది నిజం అయితే హౌస్ కు మరింత కలర్ ఆడ్ అయినట్టే..
 
ఇప్పటి వకూ హౌస్ లో చాలా మంది లేడీస్ ఉన్నా.. శ్రీసత్య మాత్రమే బ్యూటీ క్వీన్ గా వెలుగు వెలుగుతుంది. శ్రీసత్య తరువాత అంతో ఇంతో వాసంతి కలర్ ఫుల్ గా ఉంటుంది. ఆరువాత ఎవరూ అంతలా కుర్రాళ్లను ఆకట్టుకున్నవారు లేరు. వర్షిణి ఎంట్రీ ఇస్తే.. మరింత మంది యూత్ ను ఆఖర్షించవచ్చు అని బిగ్ బాస్ భావిస్తున్నారట. చూడాలి మరి ఇందులో ఎంత నిజం ఉందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: