వైరల్ అవుతున్న నిత్యామీనన్ ప్రెగ్నెన్సీ వార్త...!!

murali krishna
నిత్యా మీనన్ ప్రెగ్నెన్సీ వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. నిత్యా మీనన్ ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేయడం, అందులో పాజిటివ్ వచ్చిందంటూ ప్రకటించడం అందరికీ కూడా తెలిసిందే.
అయితే దీని వెనుకున్న స్ట్రాటజీ అందరూ గెస్ చేశారు. ఏదో ఒక సినిమా ప్రమోషన్ కోసం ఇలా చేసి ఉంటుందని అందరూ ఊహించారు. అవే ఇప్పుడు నిజమయ్యాయి. తన కొత్త సినిమా ప్రమోషన్స్ కోసమే నిత్యా మీనన్ ఇలా ప్రెగ్నెన్సీ అంటూ నాటకం ఆడిందని అర్థమైందట.
నిత్యా మీనన్ తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చింది. నిత్యా మీనన్ నోరా అనే పాత్రలో నటిస్తోన్నట్టుగా ఉంది. నోరా పాత్రకు సంబంధించిన హింట్ ఇచ్చిందట.. నాలుగు సార్లు టెస్ట చేయించుకున్నా.. అయినా పాజిటివ్ వచ్చింది.. ఇదెలా సాధ్యమైందంటూ నిత్యా మీనన్ మాట్లాడింది. అనుకోనేవే ఇలా జరుగుతుంటాయి.. అంటూ తన వండర్ వుమెన్ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ప్రకటన చేసింది. ఇది సోనీ లివ్ యాప్‌లో రాబోతోందని నిత్యా మీనన్ ప్రకటించింది.

మొత్తానికి నిత్యా మీనన్ ప్రెగ్నెన్సీ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. దీంతో ఈ రోజు వాటికి పుల్ స్టాప్ పెట్టేసింది. క్యాప్షన్ ఐడియా ఇచ్చినందుకు థాంక్స్ నోరా.. ఎక్స్‌పెక్ట్ ది అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఆన్ సోనీ లివ్ అంటూ చెప్పుకొచ్చింది. మీరంతా నిన్న కురిపించిన ప్రేమకు థాంక్స్.. నాకు ఎంతో ఆనందంగా అనిపించింది.. వండర్ వుమెన్ మీరంతా చూడాలి.. నేను ఆ క్షణాలను ఆస్వాధించాలి.. ది వండర్ వుమెన్ బిగిన్స్.. అంటూ పోస్ట్ వేసిందట.
నిత్యా మీనన్ వరుసగా సినిమాలతో పలకరిస్తోంది. ఇటు ఓటీటీ, అటు సిల్వర్ స్క్రీన్‌ల మీద నిత్యా మీనన్ దుమ్ములేపేస్తోంది. మోడ్రన్ లవ్, 19 1 a అంటూ ఇలా నిత్యా మీనన్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లో తిరు అనే సినిమాతో ధనుష్‌ పక్కన నటించి మెప్పించింది. శోభన పాత్రతో తెలుగు వారిని కూడా మెప్పించింది నిత్యా మీనన్. తమిళనాట ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: