"18 పేజీస్" మూవీ ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ ఇప్పటికే ఈ సంవత్సరం కార్తికేయ 2 మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. కార్తికేయ 2 మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ,  చందు మొండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. కార్తికేయ 2 మూవీ కి తెలుగు తో పాటు ఇతర భాషలు నుండి కూడా అద్భుతమైన కలెక్షన్ లు వచ్చాయి. దానితో కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేసి ఈ సంవత్సరం బ్లాక్ బాస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరిపోయింది. ఇలా కార్తికేయ 2 మూవీ తో ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న నిఖిల్ ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 18 పేజెస్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.
 

ఈ మూవీ లో కూడా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. నిఖిల్ ,  అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఈ మూవీ కి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ.ని డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. 18 పేజెస్ మూవీ ఓవర్సీస్ హక్కులను రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకున్నట్లు ,  ఈ మూవీ ప్రీమియర్స్ ను "యూఎస్ఏ" లో డిసెంబర్ 22 వ తేదీన ప్రదర్శించనున్నట్లు ఈ సంస్థ తాజాగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే కార్తికేయ 2 మూవీ తో మంచి జోష్ లో ఉన్న నిఖిల్  మరియు అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ కావడంతో ఈ మూవీ పై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: