ఆ హీరోయిన్ కి భోజనం పంపిన ప్రభాస్..!!

murali krishna
తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ నట వారసుడిగా ఈశ్వర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. కెరీర్ బిగినింగ్ లో పెద్దగా హిట్ చిత్రాలు పడకపోయినా.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ చిత్రంతో బక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. ఇక బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించే పాన్ ఇండియా మూవీస్ పై ప్రేక్షకులకు భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. నటుడిగా ఎంత పెద్ద రేంజ్ లో ఉన్నా.. ప్రభాస్ మనసు చాలా వెన్నెలాంటిది అని అంటారు ఆయన సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గం.ప్రభాస్ నటుడిగానే కాదు.. ఎవరికి ఏ కష్టమొచ్చినా ముందు ఉంటాడు. ప్రకృతి విపత్తులు సంబవిస్తే భారీ విరాళాలు అందిస్తుంటారు. అంతేకాదు ఆయన ఇంటికి వచ్చే గెస్టులకు ఎంతో గౌరవం ఇస్తుంటారు. ఇక ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. షూటింగ్స్ లో తాను తెప్పించిన ఫుడ్ ని కో స్టార్స్ కి దగ్గరుండి మరీ వడ్డిస్తుంటాడు ప్రభాస్. షూటింగ్ ఎక్కడైనా సరే తన సొంత వంట మనిషిని ప్రత్యేకంగా నియమించుకుంటాడు ప్రభాస్.
ఇక ఇండస్ట్రీలో తనతో నటించిన హీరోయిన్లకు ఇంటి భోజనం పంపించడం ప్రభాస్ కి అలవాటు. తనతో నటిస్తున్న కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్‌ కి భోజనం పంపించాడు. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ తో కలిసి ‘సలార్’చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది. ఇందులో భారీ తారగణం నటించబోతున్నారు.ఇక ఈ చిత్రంలో కుర్రాళ్లకు మతులు పోయే రేంజ్ లో ఐటమ్ సాంగ్ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఐటమ్ సాంగ్ లో ప్రభాస్ తో కలిసి స్టెప్పులు వేయబోతుంది కన్నడ బ్యూటీ అషిక రంగనాథ్. కన్నడ నాట సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచిపేరు తెచ్చుకున్న ఆషిక రంగనాథ్ ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్ లో తన డ్యాన్స్ తో అందరి దృష్టి ఆకర్షించేందుకు రెడీ అవుతుంది. తనతో నటిస్తున్న ఆషిక రంగనాథ్ కి ప్రభాస్ హైదరాబాద్ ఫుడ్ పంపించారు. దీనికి సంబంధించిన ఓ పిక్  వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: