విదేశాల టూర్ ముగించుకున్న మహేష్ బాబు..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొంత కాలంగా వరుస విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం కూడా సర్కారు వారి పాట మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇలా ఇప్పటికే సర్కారు వారి పాట మూవీ తో ఈ సంవత్సరం బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఇది వరకే మహేష్ బాబు , పూజా హెగ్డే కలిసి మహర్షి మూవీ లో నటించారు. వీరిద్దరి జంటకు మహర్షి మూవీ ద్వారా మంచి క్రేజీ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. అలాగే మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది.  మొదటి షెడ్యూల్లో భాగంగా ఈ మూవీ యూనిట్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించింది. ఇది ఇలా ఉంటే  ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత మహేష్ బాబు విదేశాలకు టూర్ కి వెళ్ళాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మహేష్ బాబు టూర్ ముగించుకొని ఇండియాకు తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత మహేష్ బాబు ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తేరకెక్కుతున్న మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: