కళ్యాణ్ రామ్ అభిమానులకు శుభవార్త...!!

murali krishna
కళ్యాణ్‌ రామ్‌ హీరోగా వచ్చిన బింబిసార ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. బింబిసారుడు అనే రాజు కథ ను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ మూవీ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుందట..
వశిష్ట్‌ దర్శకత్వం వహించిన ఈ లో టైమ్ ట్రావెలింగ్‌ సబ్జెక్ట్‌ను చాలా ఆసక్తికరంగా చూపించాడు. తక్కువ బడ్జెట్‌లోనే భారీ విజువల్స్‌తో ను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ ని సైతం మెస్మరైజ్‌ చేసింది. బాక్సాఫీస్‌ ముందు కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ ప్రస్తుతం ఓటీటీ లో కూడా దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే ఈ విడుదలై న నాటి నుంచి.. బింబిసారా సీక్వెల్‌కు సంబంధించి వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయ లేదు. అయితే తాజాగా దర్శకుడు సీక్వెల్‌పై ఎట్టకేలకు అధికారికంగా స్పందించాడు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బింబిసార సీక్వెల్‌ ఉంటుంద నే విషయాన్ని ప్రకటించాడట..
ఈ సందర్భంగా దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ.. ‘బింబిసారను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులు ప్రస్తుతం సీక్వెల్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగానే బింబిసార సీక్వెల్‌ను తెరకెక్కించనున్నాము’ అని చెప్పుకొచ్చారట.. అయితే కళ్యాణ్‌ రామ్‌ ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత బింబిసార-2 షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే కళ్యాణ్‌ రామ్‌ ప్రస్తుతం నవీన్‌ మేడారం దర్శకత్వంలో ఓ సినిమా లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.బింబిసారా ఎంతతి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. కళ్యాణ్ రామ్ కెరీర్ కు మంచి బౌన్సర్ లా మారింది. అప్పటివరకు ప్లాప్ లతో ఇబ్బంది పడ్డ కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: