యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతున్న కార్తికేయ కుకింగ్ వీడియో..!!

murali krishna
ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్  లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న వారిలో హీరో ఎవరు అంటే కార్తికేయ గుమ్మకొండ అని చెప్పొచ్చు
కార్తికేయ నటించిన మొదటి సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ ఆర్ఎక్స్ 100 సినిమాతో రాత్రికి రాత్రి  పెద్దా స్టార్ గా మారిపోయాడు కార్తికేయ. ఆర్ఎక్స్ 100 సినిమాతో భారీ పాపులారిటీని సంపాదించుకున్నాడు కార్తికేయ. కథ కార్తికేయ సినిమా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే మరీ.
అయితే కార్తికేయ హీరో గా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రల కు కూడా సై అంటున్నాడు ఈ నటుడు. ఇప్పటికే నాని నటించిన గ్యాంగ్ లీడర్, వలిమై లాంటి సినిమాలలో ప్రతి నాయకుడిగా నటించి మెప్పించిన విషయం మనకు తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా కార్తికేయ ఒక రెస్టారెంట్ ను ప్రారంభించాడు. గిస్మట్ అరబిక్ రెస్టారెంట్ ను కార్తికేయ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే హోటల్లో ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో పాటు రెస్టారెంట్ లోని వివిధ రకాల పదార్థాలను కూడా రుచి చూశాడు.
అంతేకాకుండా యూట్యూబ్లో అనేక వంటకాలు తన వైఫ్ తో కలిసి చూసి ప్రిపేర్ చేస్తాను అని తెలిపాడు కార్తికేయ. నాన్ వెజ్ అంటే  తనకు చాలా ఇష్టమని డైట్ కోసం ప్రతి రోజు చికెన్ తినడం తో బోర్ కొడితే మటన్ తింటూ ఉంటాను. నేను నా భార్య యూట్యూబ్ చూసి అప్పుడప్పుడు అనేక వంటకాలను కూడా ట్రై చేస్తూ ఉంటాం అని  ఇలా చెప్పుకొచ్చాడు కార్తికేయ మరీ. ఇకపోతే కార్తికేయ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కార్తికేయ బెదురులంక 2012 సినిమాలో నటిస్తున్నాడు అంటా మరీ. అలాగే యు వి క్రియేషన్స్ లో కూడా ఒక సినిమాను పూర్తి చేశాను అని తెలిపారు కార్తికేయ

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: