18 పేజెస్ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించిన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నిఖిల్ ,  చందు మండేటి దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా నిఖిల్ కు బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. హిందీ నుండి కార్తికేయ 2 మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు దక్కాయి.
 

ఇలా కార్తికేయ టు మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న నిఖిల్ తాజాగా 18 పేజెస్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పల్నాటి సూర్య ప్రతాప్ దశకత్వం వహించగా ,  అనుపమ పరమేశ్వరన్ ir మూవీ లో నిఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. 

డిసెంబర్ 23 వ తేదీన 18 పేజెస్ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే కార్తికేయ 2 మూవీ తర్వాత నిఖిల్ నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: