విక్రమ్ కుమార్ ను అలా చేసేశారేంటి!!

P.Nishanth Kumar
టాలీవుడ్ దర్శకుడు విక్రమ్ కుమార్ వైవిద్య భరితమైన సినిమాలను చేస్తూ దర్శకుడుగా తనకంటూ మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు. మాధవన్ హీరోగా నటించిన 13బి సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ఆ తరువాత ఎన్నో ఆసక్తికరమైన సినిమాలను చేశారు. ఆయన కెరియర్లో ఇప్పటికీ మంచి సినిమాగా మనం చిత్రాన్ని చెప్పుకోవచ్చు. సరికొత్త కథతో డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో రూపొందిన ఈ సినిమా ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టడంతో పాటు అక్కినేని హీరోలకు స్పెషల్ దర్శకుడుగా మారిపోయాడు

అలా అఖిల్ తో ఈయన సినిమా చేయగా అది ప్రేక్షకులను మోస్తరు గానే అలరించింది అని చెప్పాలి.
 ఏదేమైనా తన విధానాన్ని మార్చి సరికొత్త కథ తో సినిమా చేస్తే విక్రమ్ కుమార్ కు ఏ మాత్రం కలిసి రాలేదని అప్పుడు నిరూపితం అయింది. ఇక సూర్యతో ఈ దర్శకుడు చేసిన 24 సినిమా మంచి ఫలితాలనే అందుకుంది. సినిమా కొంత నిరాశపరిచినప్పటికీ ఇలాంటి వైవిధ్య భరితమైన సినిమాలను మెచ్చుకునే వారికి ఆ చిత్రం మంచి ఆసక్తిని కలిగించింది. భవిష్యత్తులో ఈ దర్శకుడు నుంచి అలాంటి ఆసక్తికరమైన కాన్సెప్ట్ లు వస్తాయని ప్రతి ఒక్కరు కూడా భావించారు

కానీ విక్రమ్ కుమార్ వరుసగా రెండు రాంగ్ ఛాయిస్ సినిమాలను ఎంచుకోవడం ఆయన కెరియర్ పై ఇప్పుడు ఎంతో ఎఫెక్ట్ పడుతుందని చెప్పాలి. నానితో చేసిన గ్యాంగ్ లీడర్ నాగచైతన్యతో చేసిన థాంక్యూ సినిమాలు రెండు కూడా ఆయనకు భారీ స్థాయిలో ప్రాబ్లం తీసుకు వచ్చాయి. రెగ్యులర్ కథలతో ఆయన ప్రేక్షకులు ముందుకు వస్తే ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వటం లేదు. కొంత వెరైటీ ఉన్న కథలను తీసుకు వస్తేనే మంచి ఫలితాలను అందుకుంటున్నాడు. ఆ విధంగా విక్రమ్ కుమార్ ఇప్పుడు ఒక వెరైటీ కథతో ప్రేక్షకుల ముందుకు రావాలి అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఎవరితో ఇలాంటి జోనర్లో చేస్తాడు చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: