సినిమా రంగంలోకి దిగిన ధోని.. దానితోనే ప్రారంభం!

murali krishna
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సరికొత్త వెంచర్లోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు క్రికెట్లో దిగ్గజ క్రీడాకారుడిగా పేరు సంపాదించుకున్న..
ధోని ఇకపై సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. తన భార్యతో కలిసి ఈ వెంచర్ను మొదలు పెట్టాడు. ధోని సంస్థలో మొదటగా తెరకెక్కనున్న సినిమా ఇదే.
ప్రముఖ స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తన బ్యాటింగ్ స్టైల్తో క్రికెట్ దిగ్గజాలలో ఒకరిగా నిలిచారు. టీమ్ ఇండియాకు కెప్టెన్సీ వహించిన ధోని.. 2007 ప్రపంచ కప్ ట్రోఫీ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్కి కెప్టెన్గా వ్యవహరించి అనేక విజయాలు సాధించారు. కొన్నేళ్ల క్రితం క్రికెట్కు బైబై చెప్పిన ధోనీ తన ఫ్యాన్స్తో అప్పుడప్పుడు మాత్రమే టచ్లో ఉంటున్నారు. ఓ వైపు యాడ్స్ చేస్తూ మరోవైపు వ్యవసాయం చేస్తూ బిజీ అయిన ధోని ఇప్పుడు మరింత బిజీ అవ్వనున్నారు.
ధోని ఎంటర్టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ను స్థాపించిన ధోని అందులో ఇకపై తెలుగు, మలయాళ, తమిళ చిత్రాలను నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ధోని సతీమణి సాక్షి సింగ్ ధోని ఈ ప్రొడక్షన్ హౌస్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. కాగా ఈ సంస్థ ఇప్పటికే 'రోర్ ఆఫ్ ద లయన్', 'ది హిడెన్ హిందు', 'బ్లేజ్ టు గ్లోరీ' వంటి డాక్యుమెంటరీలను నిర్మించింది. ఈ సంస్థ ఇప్పుడు యాడ్ ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ షోలు కూడా నిర్మిస్తోంది.
అయితే ఇకపై మెయిన్స్ట్రీమ్ సినిమాలను కూడా నిర్మించనుంది. ఈ మేరకు ధోని ఎంటర్టైన్మెంట్స్ ప్రకటన విడుదల చేసింది. ఆ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ అయిన సాక్షి సింగ్ ధోని ఆలోచనలోంచి పుట్టిన ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాకు 'అథర్వ' అనే నవల రాసిన రమేశ్ తమిళ్మణి దర్శకత్వం వహిస్తున్నారని పేర్కొంది. ఇక ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుందని ధోని ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలిపింది. ఇందులో నటీనటులని త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. "నేను సాక్షి రాసిన స్క్రిప్ట్ చదివినప్పుడే తెలుసు.. ఇది స్పెషల్ అని. ఈ కాన్సెప్ట్ కొత్తది. ఇది ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీర్చిదిద్దేందుకు నా శాయశక్తులా కృషి చేశాను " అని తమిళ్మణి అన్నారు. ఇదే కాకుండా సైన్స్ ఫిక్షన్, క్రైమ్, డ్రామా, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి జోనర్లలో మంచి సినిమాలు తీయడానికి ఈ సంస్థ వివిధ రచయితలతో, దర్శకులతో చర్చలు జరుపుతోందని ప్రకటన తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: