విలక్షణ నటుడు సాయికుమార్.. పడిన కష్టాలు తెలిస్తే కన్నీల్లాగవు?

praveen
ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న వారు ఇక సినిమాల ద్వారా ప్రకటనల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. ఈ విషయం గురించే ప్రేక్షకులందరూ పట్టించుకుంటూ ఉంటారు. కానీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిలదొక్కుకోవడానికి ఆ సినిమా స్టార్లు ఎంతలా ఇబ్బంది పడ్డారు ఎన్ని సవాళ్లను ఎదుర్కొన్నారు అన్న విషయాన్ని మాత్రం ఎవరు పట్టించుకోరు అని చెప్పాలి. ఇలా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకొని నిలబడిన స్టార్స్ చాలామంది ఉన్నారు అని చెప్పాలి. అలాంటి వారిలో విలక్షణటుడు సాయికుమార్ కూడా ఒకరు.

 ఒకప్పుడు హీరోగా నటించి  ఎన్నో సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు సాయికుమార్   ఇక తన గాత్రంతో ఇతర హీరోలకు కూడా వాయిస్ అందించి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన సాయికుమార్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలియజేశారు.  సాయికుమార్ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో తన తండ్రి చెప్పిన మాటలను పదేపదే గుర్తు చేసుకునేవాడట. ఇక కనీసం తినడానికి తిండి లేక మంచినీళ్లు తాగి పుస్తకాలు చదువుకున్న రోజులు కూడా ఉన్నాయని సాయికుమార్ చెప్పుకొచ్చారు.

 ఓ రోజు కాలేజీ నుంచి ఇంటికి వెళ్లిన సమయంలో బాగా ఆకలి వేయగా ఇక వంట గదిలోకి వెళ్లి చూస్తే ఒకరికి సరిపడా అన్నము ఉండడంతో అది తినేసి వచ్చి బయట కూర్చున్నారట సాయికుమార్. కానీ అప్పటికే అక్కడ పడుకున్న సాయికుమార్ తండ్రి శర్మ నిద్ర పట్టక అటు ఇటు కదులుతున్నారట. దీంతో భార్య కృష్ణ జ్యోతి అక్కడికి వచ్చి కాస్త తిని పడుకోమంటే వినలేదు ఇప్పుడు నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారు అంటూ అనడంతో ఆ మాటలు విన్న సాయికుమార్ ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయట. తాను తిని పడుకుంటే ఇక తన కొడుకు సాయికుమార్ ఏం తింటాడు అని ఆలోచనతోనే తండ్రి ఇక ఆకలేసిన పస్తులు ఉన్నాడు అన్న విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యాడట. ఇప్పటికీ కూడా బాగా ఆకలి వేసినప్పుడు అన్నాన్ని చూస్తే తన తల్లిదండ్రులు గుర్తుకు వస్తారట. రేడియోలో వాయిస్ చెప్పడం మొదలు పెట్టిన సాయికుమార్ ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: