అర్జున్ కల్యణ్ పై బయటపడ్డ శ్రీసత్య ప్రేమ...!!

murali krishna
21 మందితో స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగుసీజన్ 6 నుంచి మరో వికెట్ పడింది. ఈరోజు దివాళి స్పెషల్ ఎపిసోడ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసిన హౌస్ మెట్స్..
చివరిగా అర్జున్ కల్యాణ్ కు సెండ్ ఆఫ్ ఇచ్చారు. 7 వారం హౌస్ నుంచి అనూహ్యంగా.. అర్జున్ కల్యాణ్ ఎలిమినేట్ అవ్వడంతో అంతా షాక్ అయ్యారు. చాలా మంది దృష్టి వాసంతి మీద ఉంది. ఆమె వెళ్లిపోతుందేమో అని అంతా అనుకున్నారు కాని అర్జున్ కల్యాణ్ హౌస్ ను వీడవలసి వచ్చింది.
ఈ వీకెండ్ ఎపిసోడ్ చాలా సందడిగా సాగింది. దివాళి సందర్భంగా కంటెస్టెంట్స్ తో పాటు.. ఆడియన్స్ కు అన్ లిమిటెట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశాడు బిగ్ బాస్ . సెలబ్రిటీ గెస్ట్ లతో పాటు ఆటపాటలు హడావిడి నడిచింది. ఇక చివరిగా అర్జున్ కల్యాణ్ ఎలిమినేషన్ లో వాతావరణం మారిపోయింది. ఇక అప్పటి వరకూ అర్జున్ విషయంలో పట్టీ పట్టనట్టు బిహేవ్ చేసిన శ్రీ సత్య .. అర్జున్ ఎలిమినేషన్ తో ఒక్క సారిగా ఎమోషనల్ అయ్యింది. చాలా స్ట్రాంగ్ గా ఉండే శ్రీ సత్య కన్నీటి పర్యంతం అయ్యింది.
అటు హౌస్ ను వీడుతూ చాలా సాధారణంగా బయటకు వచ్చేశాడు అర్జున్ కల్యాణ్. బిగ్ బాస్ స్టేజ్ మీద మాత్రం శ్రీ సత్యను తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు. శ్రీసత్య కూడా కన్నీళ్లు పెట్టుకోవడంతో.. అర్జున్ కల్యాణ్ కూడా స్టేజ్ మీదనే ఏడ్చేశాడు. ఇక వెళ్తు వెళ్తూ.. హౌస్ లో పేలే టపాస్ లు పేలని టపాసులు గురించి క్లారిటీ ఇచ్చాడు అర్జున్... శ్రీహాన్, రేవంత్, గీతు,శ్రీ సత్య, ఫైమా ఇలా కొంత మందిని బాగా పేలే టపాసులుగా పెట్టిన అర్జున్.. బాలాదిత్య, వాసంతి, రాజ్ తో పాటు మిగిలిన వారిని పేలని పటాసులు లిస్ట్ లో చేర్చారు. వాటికి గల కారణాలు కూడా చెప్పుకొచ్చాడు అర్జున్.
చాలా వారాలు చప్పగా సాగింది బిగ్ బాస్ హౌస్‌. కాని గత కొద్ది వారాలుగా.. ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ముఖ్యంగా ఓటింగ్ విషయంలో రోజు రోజుకూ పరిస్థితి మారిపోతూ వచ్చింది. 7 వ వారంలో గీతు, ఆర్జే సూర్య తప్ప హౌస్ లో మిగిలిన వాళ్లంతా నామినేట్ అయ్యారు. హాట్ హాట్ కామెంట్ల తో వాడీ వేడి చర్చ జరిగింది నామినేషన్స్ లో. ఫైనల్ గా.. అర్జున్ కల్యాణ్ కు దెబ్బ పడింది.ఇక ఆట 7 వారానికి వచ్చేప్పటికి బిగ్ బాస్ హౌస్ లో 15 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. మొదటి వారం నుంచి వరుసగా షానీ సాల్మన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి, చలాకీ చంటి లు ఎలిమినేట్ అవ్వగా.. లాస్ట్ వీక్ హౌస్ నుంచి ఊహించని విధంగా.. సుదీప ఎలిమినేట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: