రజినీకాంత్ సూచనలతో మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా షురూ..!

murali krishna
వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న సూపర్ స్టార్ రజినికాంత్ ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన చిత్రం 'పేట'..కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా తమిళం లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..కమర్షియల్ గా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టింది అనే విషయాన్నీ కాసేపు పక్కన పెడితే..ఒక వీరాభిమాని తన అభిమాన హీరో ని వెండితెర పై ఎలా అయితే చూడాలనుకుంటున్నాడో..అలా రజినీకాంత్ ని ఆ సినిమాలో చూపించాడు కార్తీక్ సుబ్బరాజ్.పవన్ కళ్యాణ్ కి ఇక్కడ గబ్బర్ సింగ్ ఎలాంటి సినిమానో, తమిళనాడు లో రజినీకాంత్ కి పేట సినిమా అలాంటిది అని చెప్పొచ్చు..ఇప్పుడు ఆ సినిమాకి దర్శకత్వం వహించిన కార్తీక్ సుబ్బరాజ్ త్వరలో మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది..కార్తీక్ సుబ్బరాజ్ ని చిరంజీవి కి స్వయంగా రజినీకాంత్ గారే సూచించారట..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ మారిపోయింది.
చిరంజీవి మరియు రజినీకాంత్ మంచి స్నేహితులు అనే విషయం మన అందరికి తెలిసిందే..పాత రోజుల్లో వీళ్లిద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు కూడా..చిరంజీవి సినిమాలను రజినీకాంత్ మరియు రజినీకాంత్ సినిమాలను చిరంజీవి చూసుకుంటూ ప్రశంసించుకుంటూ ఉంటారు..అలా లేటెస్ట్ గా మెగాస్టార్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన గాడ్ ఫాదర్ సినిమాని చూసిన రజినీకాంత్ చిరంజీవి కి ఫోన్ చేసి ప్రశంసలతో ముంచి ఎత్తారట..అంతే కాకుండా తనతో పేట సినిమా తీసిన కార్తీక్ సుబ్బరాజ్ నీ కోసం ఒక అద్భుతమైన కథ రాసాడు..నాకు కూడా వినిపించాడు..చాలా బాగా అనిపించింది..నీకు ఇంకా ఆ కథ చెప్పలేదా అని చిరంజీవి ని రజినీకాంత్ అడగగా, దానికి చిరంజీవి సమాధానం చెప్తూ 'అవునా..నా దగ్గరకి అతను ఇంకా రాలేదు' అని బదులిచ్చాడట..అప్పుడు రజినీకాంత్ 'అతనితో సినిమా చెయ్యి..అద్భుతంగా తీస్తాడు..మనలోని వింటేజ్ యాంగిల్ ని బయటకి లాగడమే అతని స్పెషలిటీ' అని చెప్పాడట.రజినీకాంత్ అలా చెప్పడం తో వెంటనే చిరంజీవి కార్తీక్ సుబ్బరాజ్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకొని అతను తనకోసం రాసుకున్న కథని వినిపించుకున్నాడట..కథ విని ఎంతో ఆకర్షితుడైన చిరంజీవి ఈ సినిమా చెయ్యడానికి వెంటనే అంగీకరించాడట..మరి పేట సినిమాతో వింటేజ్ రజినీకాంత్ ని వెండితెర మీద చూపించి అభిమానులకు పండగ తెచ్చిన కార్తీక్ సుబ్బరాజ్..చిరంజీవి ని ఎలా చూపించబోతున్నాడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: