వీరి మధ్య గ్యాప్‌కు కారణం ఇదే..!

murali krishna
టాలీవుడ్లో పునాదిరాళ్లు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొణిదల శివశంకర ప్రసాద్ ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ మెగాస్టార్ గా ఎదిగారు. చిరు తన కెరీర్ లో ఇప్పటివరకు 150కు పైగా సినిమాల్లో నటించారు.
ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నారు. ఇన్నేళ్ల కెరీర్లో చిరంజీవి ఎంతోమంది హీరోయిన్లతో నటించారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. చిరంజీవితో ఒక్క సినిమాలో నటించే ఛాన్స్ వస్తే చాలు.. అనుకున్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు.
విచిత్రం ఏంటంటే ఈ తరం కుర్ర హీరోయిన్లు కూడా చిరుకు జోడిగా ఒక్క సినిమాలో నటిస్తే తమ జన్మ ధన్యం అయిపోయినట్టే అని భావిస్తూ ఉంటారు. తమన్నా లాంటి వాళ్లే చిరుతో నటించాలని ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇక ఇప్పుడు మరో కుర్రభామ శృతిహాసన్ సైతం చిరుకు జోడిగా వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే చిరు భోళాశంకర్ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి జోడి కడుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సైరా సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
చిరు అటు వైపు ఎంత సీనియర్ హీరోయిన్ ఉన్నా చాలా సింపుల్‌గా నటించేస్తారు. చిరుతో డ్యాన్సుల్లో పోటీ పడాలంటే కూడా హీరోయిన్లు చెమటోడ్చేవారు. అయితే చిరు తన కెరీర్‌లో ఏ హీరోయిన్‌తోనటించేటప్పుడు పెద్దగా ఇబ్బంది పడలేదట. ఇద్దరు హీరోయిన్లతో మాత్రం ఆయనకు ఇబ్బందులు తప్పలేదట. రాధతో డ్యాన్సులు చేసేటప్పుడు చిరుకే చెమటలు పట్టేవట. డ్యాన్స్ మాస్టర్ మూమెంట్ చెప్పాక చిరుకు ఆ మూమెంట్ ట్రై చేసి చేసేందుకు 10 నిమిషాలు పట్టేదట. అయితే రాధ మాత్రం ఇలా చెప్పిన వెంటనే పట్టేసి సెట్స్ మీదకు వచ్చేదని. ఆమెతో డ్యాన్స్ అంటే తనకే కాస్త టైం పట్టేదని చెప్పారు.
అలాగే మరో సీనియర్ హీరోయిన్ మాధవితో నటించేటప్పుడు చిరుకు చాలా సార్లు కోపం వచ్చేదట. ఇందుకు కారణం కూడా ఉంది. చిరు - మాధవి కాంబోలో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. ఇంట్లోరామయ్య వీథిలో కృష్ణయ్య తో పాటు చిరు కెరీర్‌ను టర్న్ చేసి ఆయనను మెగాస్టార్‌ను చేసిన ఖైదీ సినిమాలో సైతం మాధవి జోడీగా నటించింది. అయితే చిరు సెట్లో చిరుతో ఎప్పుడు స్నేహంగా ఉండేదే కాదట.
ఇందుకు కారణం ఏంటంటే మాధవి సినిమాల్లో వెలిగిపోవాలని.. ఇక్కడ కొన్నేళ్లు రాజ్యం ఏలాలని.. స్టార్ హీరోయిన్ అయిపోవాలని ఇండస్ట్రీకి రాలేదట.ఇక ఆమెపై ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా ఆంక్షలు ఉండేవట.. సినిమా వాళ్లతో క్లోజ్‌గా ఉంటే వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులతో పాటు పెళ్లి విషయంలో సమస్యలు వస్తాయని ఆమెను ముందు నుంచే హెచ్చరిస్తూ వచ్చేవారట.
అందుకే ఆమె ఇండస్ట్రీ వాళ్లతో జస్ట్ షూటింగ్ వరకే ఆ తర్వాత అంత క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేసేదే కాదట. అయితే ఓ సారి చిరు నువ్వు ఎందుకు నాతో క్లోజ్‌గా మూవ్ అవ్వవు. రాధ సీన్ తర్వాత కూడా క్లోజ్‌గా ఉంటుంది..అలా చేస్తే సినిమాలో కెమిస్ట్రీ బాగా పండుతుందని చెప్పేవారట. అయినా మాధవి మాత్రం చిరు మాట లైట్ తీస్కోనేవారట.. అందుకే చిరుకు మాధవితో నటించడం అంటే అసహనంగా ఉండేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: