నాని దర్శకుడుతో విజయ్ దేవరకొండ సినిమా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి చూపులు మూవీ తో హీరోగా మంచి గుర్తింపు ను తెచ్చుకున్న ఈ హీరో అర్జున్ రెడ్డి , గీతా గోవిందం వంటి పలు బ్లాక్ బస్టర్ మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ "లైగర్" అనే పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో అనన్య పాండే హీరోయిన్ గ నటించగా , పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.  

భారీ అంచనాల నడుమ విడుదల అయిన లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర  ఫ్లాప్ గా మిగిలింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ , సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఖుషి మూవీ సెట్స్ పై ఉండగానే విజయ్ దేవరకొండ మరో క్రేజీ దర్శకుడి తో మూవీ చేయడానికి కమిట్ అయినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న గౌతమ్  తిన్నానురి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి ,  విజయ్ దేవరకొండకు ఒక కథ కు సంబంధించిన లైన్ ను వినిపించగా , ఆ కథ లైన్ బాగా నచ్చిన విజయ్ దేవరకొండ పూర్తి కథను రెడీ చేయమన గౌతమ్ తిన్ననూరి ని కోరినట్లు తెలుస్తోంది. ఖుషి మూవీ షూటింగ్ పూర్తి కాగానే విజయ్ దేవరకొండ , గౌతమ్ తిననూరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: