కార్తికేయ 2 మూవీ టోటల్ గా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మండేటి దర్శకత్వంలో తాజాగా కార్తికేయ 2 మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన కార్తికేయ మూవీ కి సీక్వల్ గా తెరకెక్కింది. కార్తికేయ మూవీకి సీక్వల్ గా తెరకెక్కడంతో కార్తికేయ 2 మూవీ పై కూడా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన కార్తికేయ 2 మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది.

దానితో కార్తికేయ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే కార్తికేయ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్ల గొట్టి బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి హిందీ నుండి కూడా అద్భుతమైన కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే కార్తికేయ మూవీ తన బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. కార్తికేయ మూవీ ప్రపంచ వ్యాప్తంగా టోటల్ గ సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


నైజాం : 13.30 కోట్లు .
సీడెడ్ : 5.02 కోట్లు .
యు ఏ : 4.53 కోట్లు .
ఈస్ట్ : 2.61 కోట్లు .
వెస్ట్ : 1.68 కోట్లు .
గుంటూర్ : 2.80 కోట్లు .
కృష్ణ : 2.29 కోట్లు .
నెల్లూర్ : 1.12 కోట్లు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ 2 మూవీ టోటల్ గా 33.35 కోట్ల షేర్ , 56.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  2.95 కోట్లు .
ఓవర్ సీస్ లో :  6.55 కోట్లు .
నార్త్ ఇండియా లో : 15.55 కోట్లు .
ప్రపంచ వ్యాప్తంగా కార్తికేయ 2 టోటల్ గా 58.40 కోట్ల షేర్ , 121.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: