నాగచైతన్య సినిమాలో నేషనల్‌ అవార్డు హీరోయిన్‌?

murali krishna
అక్కినేని నటవారసుడు నాగచైతన్య ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. 'లవ్‌స్టోరీ', 'బంగార్రాజు' వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు మీదున్న నాగచైతన్య స్పీడుకు 'థాంక్యూ' చిత్రం బ్రేకులు వేసింది.
విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 22న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
NC22 movie | అక్కినేని నటవారసుడు నాగచైతన్య ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. 'లవ్‌స్టోరీ', 'బంగార్రాజు' వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు మీదున్న నాగచైతన్య స్పీడుకు 'థాంక్యూ' చిత్రం బ్రేకులు వేసింది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 22న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫేయిల్యూర్‌గా మిగిలింది. ప్రస్తుతం ఈయన ‘మానాడు’ ఫేమ్‌ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ పోలీస్‌ యాక్షన్‌ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా చిత్రబృందం ఓ బిగ్‌ అప్‌డేట్‌ను ప్రకటించింది.
ఈ చిత్రంలో నేషనల్‌ అవార్డు గ్రహిత ప్రియమణి నటించనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రియమణి ముఖ్య పాత్ర పోషించనుందట. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాడు. నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. తమిళ హీరో జీవా, అరవింద్‌ స్వామి కీలకపాత్రల్లో నటించనున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు.
ప్రస్తుతం నాగచైతన్య నటించిన 'ధూత' వెబ్‌సిరీస్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. సూపర్‌ నాచ్యురల్ పవర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ను నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్‌తో కలిసి అమేజాన్ ఒరిజినల్స్ నిర్మిస్తుంది. ఈ వెబ్‌సీరీస్‌లో మలయాళ భామ పార్వతి, ప్రియాభవాని శంకర్, ప్రచి దేశాయ్, తరుణ్ భాస్కర్‌ కీలక పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: