టాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చిన కాంబోలు..!

murali krishna
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లో ప్రేక్షకులు చాలా బాగా ఆకట్టుకుంటాయి. అలా ప్రేక్షకులను ఆకట్టుకున్న కొన్ని కాంబోలను మనం ఇప్పుడు చూద్దాం.
బాలకృష్ణ-శ్రియ:
నందమూరి బాలకృష్ణ హీరోయిన్ శ్రేయ వీరిద్దరి కాంబోలో వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరిద్దరూ మొదటిసారిగా 2002లో చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా టైంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ 2015 లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వస్సుల్ సినిమాలో నటించి అందరిని మెప్పించారు. వీరిద్దరి కాంబో ప్రేక్షకలను అభిమానులను చాలా బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.
వెంకటేష్-మీనా:
ఫ్యామిలీ సినిమాలతో ప్రేమ సినిమాలతో ప్రేక్షకులను బాగా దగ్గరైన హీరో విక్టరీ వెంకటేష్… విక్టరీ వెంకటేష్ హీరోయిన్ మీనా కాంబోలో వచ్చిన పలు సినిమాలు సూపర్ హిట్ సినిమాలు గా నిలిచాయి.వీరిద్దరి కాంబోలో మొట్టమొదటిసారిగా 1990లో చంటి సినిమా వచ్చింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగానచ్చింది.. ఈ సినిమా ద్వారా వెంకటేష్‌కు మీనాకు ఫ్యామిలీ ఆడియన్స్ లు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో అబ్బాయి గారు, సుందరకాండ వంటి పలు సినిమాలు వచ్చాయి. మళ్లీ 22 ఏళ్ల తర్వాత వీరి కాంబోలో దృశ్యం సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. మళ్లీ ఈ ఇద్దరికి కాంబో హిట్ జంటగా నిలిచింది.
నాగార్జున-రమ్యకృష్ణ:
టాలీవుడ్ కింగ్ మన్మధుడు నాగార్జున శివగామి రమ్యకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 90, 2000 దశకం మధ్యలో రమ్యకృష్ణ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఆ టైంలోనే రమ్యకృష్ణ, నాగార్జున కాంబోలో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే అభిమానులకు పండగ లాగా ఉంటుంది. వీరిద్దరూ కలిసి నటిచ్చిన పళ్ళుసినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో బ్రదర్, ఘరానా బుల్లోడు, అన్నమయ్య , రీసెంట్ గా వచ్చిన బంగారు రాజు వంటి పలు సినిమాల్లో వీళ్ళిద్దరూ కలిసి నటించారు.
రాజేంద్రప్రసాద్-ఆమని:
కామెడీ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం తెచ్చుకున్న హీరో రాజేంద్రప్రసాద్. కామెడీ సినిమాలకు పెట్టింది పేరు రాజేంద్రప్రసాద్ . రాజేంద్రప్రసాద్ ఆమని కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. వీరిద్దరి కాంబోలో మొదటి సినిమాగా వచ్చిన సినిమా 1993లో బాబు దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ పెళ్ళాం.. ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా ద్వారా వీళ్ళిద్దరి జంటకు మంచి పేరు వచ్చింది.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి వీరిద్దరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మళ్లీ 22 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో ఆ నలుగురు సినిమాలో కలిసి నటించారు.
మోహన్ బాబు-మీనా,:
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాన డైలాగులతో నటనతో టాలీవుడ్ లోనే మంచి గుర్తింపుెచ్చుకున్నారు.. ఎలాంటి పాత్రలోనైనా ఆయన నటించగలరు. మోహన్ బాబు హీరో గానే కాకుండా కమెడియన్ గా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఎన్టీఆర్ ,కృష్ణ, ఏఎన్ఆర్ వంటి హీరోలకి ప్రతి నాయకుడుగా నటించారు. మోహన్ బాబు మీనా కాంబో కూడా ఎంతో క్రేజ్ ఉంది టాలీవుడ్లో.. వీరిద్దరి కాంబోలో మొదటిసారిగా 1992లో అల్లరి మొగుడు సినిమాలో నటించారు. ఆ టైంలో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.. తర్వాత వీరిద్దరు కొన్ని సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత 23 సంవత్సరాలు తర్వాత వీరిద్దరూ కలిసి మామ మంచు అల్లుడు కంచు సినిమాలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: