అమ్మ కోసం అయినా ఆ సినిమా చేస్తా....!!

murali krishna
వైవిధ్య  మైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌ లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చు కున్నాడు యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌. ఇండస్ట్రీ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరో గా నిల బడ్డాడు.ఆయన కెరీర్‌ లోనే భారీ బ్లాక్‌ బస్టర్‌ అయిన చిత్రం 'కార్తికేయ 2'. ఈ ఏడాది ఆగస్ట్‌ 13న విడుదలైన ఈ చిత్రం రూ.130 కోట్లకు పైగా వసూళ్ల ను సాధించి రికార్డు సృష్టించింది. చందూ మొండేటి దర్శ కత్వం వహించిన ఈ చిత్రం థియేటర్స్‌ లోనే కాకుండా ఓటీటీ లోనూ ఘన విజయం సాధించింది. ఈ సినిమా కు సీక్వెల్‌ కూడా తీయా లని అభి మానులు కోరు కుంటున్నారు. ఈ నేపథ్యం లో కార్తికేయ 3పై నిఖిల్‌ స్పందించాడు తాజా గా ఆయన ఓ ఆంగ్ల మీడియా తో మాట్లా డుతూ.. 'ముందు కార్తికేయ సినిమా తీస్తు న్నప్పుడు సీక్వెల్ అనుకోలేదు. కానీ ఎక్కడికి వెళ్లినా కార్తికేయ 2 ఎప్పుడు తీస్తారు అని అడిగారు. అంటే ప్రేక్షకులు ఆ సినిమా ను అంతగా కోరు కున్నారని అర్థమైంది. ఇప్పుడు కార్తికేయ 3 గురించి అడుగు తున్నారు. ఆ సినిమా అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఒకవేళ నేను కార్తికేయ 3 చేయక పోతే అభి మానులు ఏమంటారో తెలియదు కానీ మా అమ్మ మాత్రం నన్ను వదలదు. అమ్మ కోసం అయినా ఆ సినిమా చేయాలి' అని చెప్పు కొచ్చాడు. అలాగే ఆర్‌ ఆర్ ‌ఆర్‌ సినిమా కు ఆస్కార్‌ అవార్డు విషయం పై మాట్లాడుతూ..
'ఆర్ఆర్ఆర్ సినిమా కు ఆస్కార్ అవార్డ్ వస్తే బాగుం టుంది. కానీ ప్రతి సినిమా ఆస్కార్ కోసం తీయరు. ఇది కేవలం సర్టిఫికేట్ కాదు. మాకు ప్రేక్షకుల ప్రేమా భిమానాలు అన్నింటి కంటే ముఖ్యం. అవే గొప్పవి 'అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: