ఇండస్ట్రీలో టాలెంట్ చూసి ఛాన్స్ ఇచ్చేవారు చాలా తక్కువ... నిధి అగర్వాల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ ,  మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయిన నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సవ్యసాచి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మిస్టర్ మజ్ను మూవీ లో అక్కినేని అఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ మూవీ తో ఈ ముద్దు గుమ్మ బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇప్పటికే నిధి అగర్వాల్ ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయిన హీరో మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా నిధి అగర్వాల్ సినీ ఇండస్ట్రీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

సినిమా ఇండస్ట్రీ లో టాలెంట్ ను చూసి ఛాన్స్ లు ఇచ్చేవారు చాలా తక్కువ అని ,   హీరోయిన్ లు అందంగా ఉన్నారా ... లేరా .. అని చూస్తారు అని ,  రాబోయే మూవీ లలో హీరోయిన్ ల పని గ్రామర్ షో చేయడం మాత్రమే అని ,  నేను గ్లామర్ షో చేయడానికి ఏ మాత్రం వెనకాడను అని నిధి అగర్వాల్ తాజాగా చెప్పు కొచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నిధి అగర్వాల్ ,  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ ,  మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో ఈ ముద్దు గుమ్మ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: