దళపతి విజయ్ నెక్స్ట్ లెవెల్ డాన్స్ చూడ్డానికి అంతా రెడీగా ఉండండి... జానీ మాస్టర్..!

Pulgam Srinivas
దళపతి విజయ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తలకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దళపతి విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు.  ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఈ మూవీ ని ఏక కాలంలో తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల చేయనున్నారు. తమిళ భాషలో ఈ మూవీ వరసు అనే టైటిల్ తో విడుదల కానుండగా , తెలుగు లో ఈ మూవీ వారసుడు అనే టైటిల్ తో విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఇప్పటికే వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ గురించి ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియా వేదిక గా వెల్లడించాడు. తాజాగా దళపతి విజయ్ ,  వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కి ఒక మాస్ సాంగ్ ను కంపోజ్ చేసిన జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ... దళపతి విజయ్ సార్ అభిమానులు, నా మాటలను గుర్తు పెట్టుకోండి , దళపతి విజయ్ గారి నెక్స్ట్ లెవెల్ మాస్ డాన్స్ ను చూడటానికి సిద్ధం గా ఉండండి. దీన్ని థియేటర్ లలో ఎవరూ కూర్చోని చూడలేరు అంటూ జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా చెప్పు కొచ్చారు. ప్రస్తుతం జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: