మన్మధుడు క్రేజ్ మామూలుగా లేదుగా..!!

murali krishna
టాలీవుడ్ లో కింగ్‌గా, మన్మధుడుగా నాగార్జున అక్కినేనికి  గారికి ఎలాంటి క్రేజ్ ఉందో  మన అందరికీ తెలిసిందే. అక్కినేని అందగాడు అని అమ్మాయిలే కాదు..హీరోయిన్స్ కూడా తెగ పొగడ్తలతో ముంచేస్తుంటారు.
నిర్మాతగా, హీరోగా నాగార్జున ఎంత ప్రొఫషనల్‌గా ఉంటారో ఆన్స్క్రీన్ మీద హీరోయిన్స్‌తో రొమాన్స్ చేసే విషయంలో కూడా  అలానే అంతే ప్రొఫషనల్‌గా ఉంటారు. గీతాంజలి లాంటి సినిమాలో నాగార్జున హీరోయిన్‌కి ఇచ్చిన పెదవి ముద్దు  మనం ఇప్పటికీ యూట్యూబ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.
కెరీర్ ప్రారంభంలో నాగార్జునకి  ఎక్కువ ఫ్లాప్స్ వచ్చినా కూడా ఆ తర్వాత నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన స్టార్ డంని సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఏ హీరోకి లేని హీరోయిన్స్ ఫాలోయింగ్ నాగార్జునకి  ఎక్కువ గా వచ్చింది. ఆయనతో రొమాన్స్ చేయాలంటే హీరోయిన్స్ అస్సలు ఆలోచించరు. మరి ఏం చెప్పి అంతగా లీనమవుతారో గానీ, సీన్స్ మాత్రం వేడెక్కిస్తుంటాయి. కొందరు హీరోయిన్స్ మంచి రొమాంటిక్ సీన్స్ చేయాలంటే నాగార్జున సినిమా అయితే బావుంటుందని ఫీలవుతుంటారు.
దీనికి ఉదాహరణలు చాలా సినిమాలున్నాయి. వాటిలో గీతాంజలి, నిన్నే పెళ్ళాడతా, మన్మధుడు, క్రిమినల్ లాంటి సినిమాలు. ఆఖరికి భక్తి ప్రధానంగా రూపొందించిన అన్నమ్మయ్య సినిమాలోనూ హీరోయిన్స్‌తో కాస్త ఆ తరహా సన్నివేశాలున్న సంగతి తెలిసిందే. టబు తర్వాత నాగార్జునతో రొమాంటిక్ సీన్స్‌లో బాగా ఎంజాయ్ చేసిందీ అంటే మనీషా కోయిరాల. క్రిమినల్ సినిమా అంటే ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చేది తెలుసా..మనసా అనే పాట.
సినిమా మొత్తంలో ఈ సాంగ్‌కి ఎంత ప్రత్యేకంగా ఉందో అందరికీ తెలిసిందే. ఈ సాంగ్‌లో నాగ్‌తో రొమాన్స్ చేసిన మనీషా..మళ్ళీ ఆ తరహా సీన్స్ చేసే ఛాన్స్ ఏ సినిమాలోనూ రాలేదని చెబుతుంటుందట. తన సినిమాలు చూస్తే కూడా ఈ విషయం అర్థమవుతుంది. సాంగ్ మొత్తం  ఒక అద్భుతమైన రొమాంటిక్ షాట్స్‌తో అలరిస్తుంది. రాత్రిళ్ళు లవర్స్ గానీ, కొత్తగా పెళ్ళైన వారు గానీ ఈ సాంగ్ చూస్తే ఇక ఆ రాత్రి స్వర్గంలోకి వెళ్ళి రావాల్సిందే మరి, మనీషాకి కూడా ఈ సాంగ్‌తో మనీషా కోరిక కూడా బాగా తీరింది అంటా

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: